Begin typing your search above and press return to search.
కోవిడ్ -19 వ్యాక్సిన్ వేయించుకున్న కమల్
By: Tupaki Desk | 2 March 2021 2:50 PM GMTవిశ్వనటుడు కమల్ హాసన్ మంగళవారం చెన్నై నగరంలోని ఓ ఆసుపత్రిలో కోవిడ్ -19 వ్యాక్సిన్ వేయించుకున్నారు. దేశవ్యాప్తంగా 60 ప్లస్ వయసు ఉన్న వారికి టీకాలు వేయడం ప్రారంభమైన ఒక రోజు తర్వాత నటుడు కం రాజకీయ నాయకుడు కమల్ హాసన్ కి వ్యాక్సిన్ వేయించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం తొలిగా వ్యాక్సిన్ వేయించుకున్న సంగతి తెలిసినదే. ఆ తర్వాత పలువురు నాయకులు అదేబాటలో వ్యాక్సిన్లు వేయించుకున్నారు.
``నేను శ్రీ రామచంద్ర ఆసుపత్రిలో కరోనావైరస్ వ్యాక్సిన్ తీసుకున్నాను. తమను మాత్రమే కాకుండా జనజీవన స్రవంతిలో ఇతరులను కూడా పట్టించుకునే వారు టీకాలు వేయించుకోవాలి`` అని కమల్ హాసన్ ట్వీట్ లో పేర్కొన్నారు. ఇది శరీరంలో రోగనిరోధకత పెంచేది. ఇక వెంటనే అవినీతికి వ్యతిరేకంగా వచ్చే నెలలో టీకాలు వేద్దాం.. సిద్ధంగా ఉండండి`` అని వ్యాఖ్యను జోడించారు.
తమిళనాడులోని మక్కల్ నీది మయం (ఎంఎన్ఎమ్) రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడుగా కమల్ హాసన్ పేరు మార్మోగుతోంది. ఏప్రిల్ 6న జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు వెళుతున్నామని ఆయన తాజా ప్రకటనతో హింట్ ఇచ్చినట్టయ్యింది.