Begin typing your search above and press return to search.
పోలీసులు వేధిస్తున్నారంటూ హైకోర్టును ఆశ్రయించిన కమల్ హాసన్
By: Tupaki Desk | 17 March 2020 10:30 AM GMTప్రముఖ నటుడు కమల్ హాసన్ హీరోగా, ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఇండియన్-2 చిత్ర షూటింగ్ సందర్భంగా చెన్నైలో ఇటీవల భారీ ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణలో భాగంగా భారీ క్రేన్ సహాయంతో షూటింగ్ జరుపుతున్న సందర్భంలో ప్రమాదవశాత్తు క్రేన్ కూలిపోయిన ఘటనలో ముగ్గురు సిబ్బంది అక్కడికక్కడే మరణించగా, మరో తొమ్మిది మంది గాయపడ్డారు. సెట్స్‌లో ముగ్గురు సిబ్బంది చనిపోవడం తమిళ ఇండస్ట్రీతోపాటు అందరినీ షాక్‌కు గురిచేసింది. ఈ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న కమల్ హాసన్ ప్రమాదం లో మృతి చెందిన వారి కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పోలీసులు చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌పై, కమల్ హాసన్ మరియు దర్శకుడు శంకర్ పై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అయితే ఈ కేసు విచారణలో భాగంగా పోలీసులు తనను వేధిస్తున్నారంటూ కమల్ హాసన్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి పోలీసుల విచారణ తీరు అభ్యతరకరంగా ఉందని, ప్రమాదాన్ని నటించి చూపించమంటూ పోలీసుల వేధింపులకు గురిచేస్తున్నారంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు. కమల్ పిటిషన్‌ను అత్యవసర విచారణకు మద్రాస్ హైకోర్టు స్వీకరించింది.