Begin typing your search above and press return to search.
భాషా చర్చపై కమల్ హాసన్ - శేష్ స్పందనలు
By: Tupaki Desk | 27 May 2022 4:30 AM GMTవివాదాస్పద `హిందీ వర్సెస్ సౌత్` లాంగ్వేజ్ డిబేట్ ఇటీవల పెద్ద చర్చనీయాంశమైంది. దేశవ్యాప్తంగా యువతరం దీనిపై చర్చిస్తున్నారు. ముఖ్యంగా సెలబ్రిటీలకు కచ్ఛితంగా ఇలాంటి ఒక ప్రశ్న ఎదురవుతోంది. తాజాగా `విక్రమ్` ప్రమోషన్ కోసం దిల్లీ వెళ్లిన కమల్ హాసన్ కి ఇది ఎదురైంది. విలేకరుల సమావేశంలో పాన్-ఇండియా చిత్రాలపై నా.. ఇప్పటికే కొనసాగుతున్న భాషా చర్చలపైనా తన అభిప్రాయాలను విలేకరులు అడిగారు. వేరొక ఇంటర్వ్యూలో అడివి శేష్ కి పాన్ ఇండియా సినిమాపైనా ప్రశ్నలు ఎదురయ్యాయి. వాటికి ఆ ఇద్దరూ తెలివిగా స్పందించారు.
విక్రమ్ ప్రమోషన్స్ సమయంలో కమల్ హాసన్ పదోసన్.. మొఘల్-ఏ-ఆజం వంటి క్లాసిక్ సినిమాలకు ఉదాహరణలను అందించారు. పాన్-ఇండియా సినిమాలు ఎప్పుడూ ఉన్నాయని చెప్పారు. మీరు బంగారం కోసం పాన్ చేసినప్పుడు.. కొత్త పదాలు.. నాణేల కోసం పాన్ చేస్తారు. పాన్ ఇండియా సినిమాలు ఎల్లప్పుడూ ఉన్నాయి... అని అన్నారు. శాంతారామ్ జీ పాన్ ఇండియా సినిమాలు చేసాడు. `పదోసన్` పాన్ ఇండియా సినిమా. మెహమూద్ జీ సినిమాలో దాదాపు తమిళం మాట్లాడాడు. మీరు `మొఘల్-ఎ-ఆజం` ని ఏమని పిలుస్తారు? ఇది నాకు పాన్ ఇండియా సినిమా. ఇది కొత్తేమీ కాదు``.. వివిధ భాషలు మాట్లాడే వారైనా ఐక్యంగా ఉండడమే దేశానికి అందం అని కమల్ అన్నారు.
హిందీ వర్సెస్ సౌత్ డిబేట్ పై కమల్ హాసన్
RRR -KGF చాప్టర్ 2 వంటి చిత్రాల విజయం తర్వాత జరుగుతున్న భాషా చర్చ గురించి అడిగినప్పుడు ``నేను భారతీయుడిని. మీరు ఎవరు..ఏమిటీ?`` అని ఎదురు ప్రశ్నించారు. ``తాజ్ మహల్ నాది.. మధురై దేవాలయం మీదే. కన్యాకుమారి నీది .. కాశ్మీర్ నాది`` అంటూ కమల్ తనదైన శైలిలో విలక్షణంగా స్పందించారు.
విక్రమ్ భారీ మల్టీస్టారర్ గా తెరకెక్కింది. కమల్ హాసన్- ఫహద్ ఫాసిల్ - విజయ్ సేతుపతి వంటి టాప్ స్టార్లు కీలక పాత్రల్లో నటించిన హై-ఆక్టేన్ యాక్షన్ చిత్రమిది. ఈ చిత్రంలో శివాని నారాయణన్- కాళిదాస్ -జయరామ్- నరేన్- ఆంటోని వర్గీస్- అర్జున్ దాస్ సహాయక పాత్రల్లో నటిస్తున్నారు. కోలీవుడ్ లో తాజా సంచలనం ప్రకారం ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషించారనే టాక్ ఉంది. విక్రమ్ ను లోకేష్ కంగరాజ్ తెరకెక్కించగా.. కమల్ హాసన్ సొంత ప్రొడక్షన్ లో నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కోసం హాసన్ ఇటీవల 75వ వార్షిక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొన్నారు. జూన్ 3న విక్రమ్ థియేటర్లలోకి రానుంది
శేష్ స్పందన మ్యాజికల్
యువనటుడు అడివి శేష్ నటించిన మేజర్ పాన్ ఇండియా కేటగిరీలో విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ప్రమోషన్ కార్యక్రమాల్లో అతడికి కూడా ఇలాంటి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. వాటికి తెలివైన జవాబులిస్తున్నారు. `పాన్-ఇండియా స్టార్ డమ్` గురించి అడిగిన ఓ ప్రశ్నకు సాధ్యమైనంత ఉత్తమంగా సమాధానం ఇవ్వాలని శేష్ ముందే ప్రిపేరయ్యారని తాజా జవాబు చెబుతోంది. అడివి శేష్ భారతదేశం అంతటా తన మేజర్ చిత్రాన్ని దూకుడుగా ప్రమోట్ చేస్తున్నాడు అతను సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ లలో థియేటర్లలో చాలా మంది అభిమానులు వ్యక్తులతో సంభాషిస్తున్నాడు.
మేజర్ భారతదేశంలోని ప్రీమియర్ షోలలో ఒకదానితో గొప్ప స్పందనను అందుకుంటోంది. తన ట్విట్టర్ ఇంటరాక్షన్ లలో అడివి శేష్ ని పాన్ ఇండియాపై ప్రశ్నించగా.. అతడు తెలివైన జవాబిచ్చారు.
ఇప్పుడు మీరు కూడా పాన్ ఇండియా స్టార్ అని అనుకుంటున్నారా ??? అన్నది అభిమాని ప్రశ్న. దీనికి శేష్ ఉత్తమమైన ప్రత్యుత్తరం ఇచ్చాడు.
నేను #మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ అన్ని భారతీయ హీరో అని అనుకుంటున్నాను. భారత జాతీయ జెండాని గౌరవిస్తాను.. అని అన్నారు. ఇది అత్యుత్తమ సమాధానంగా నిలిచింది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ లాంటి భారతీయ హీరోపై సినిమాని దేశభక్తి నేపథ్యంలో సినిమాని వివాదాస్పదం చేయడం సరికాదు.