Begin typing your search above and press return to search.
సౌత్ స్టార్లకు దంగల్ మిస్ అయిందా?
By: Tupaki Desk | 18 Jan 2017 7:46 AM GMTప్రస్తుతం బాలీవుడ్ లో సెన్సేషన్స్ క్రియేట్ చేస్తున్న మూవీ దంగల్. రెజ్లర్ మహావీర్ సింగ్ ఫొగట్ పాత్రలో మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ ఒదిగిపోయిన తీరు.. ఆ రోల్ కోసం ఆమిర్ ఖాన్ పడ్డ కష్టం.. అందిరనీ మెప్పించాయి. దేశవ్యాప్తంగా ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువు అయిన దంగల్.. కొత్త రికార్డులను నమోదు చేస్తూ దూసుకుపోతోంది.
ఈ ప్రాజెక్టు గురించి నిర్మాణ సంస్థ యూటీవీ మోషన్ పిక్చర్స్ ఇప్పుడు కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పింది. 'ఈ స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నాక.. దంగల్ స్టోరీకి ఆమిర్ ఖాన్ పర్ఫెక్ట్ అనుకున్నాం. ఒకవేళ మహావీర్ సింగ్ పాత్రను ఆమిర్ కనుక చేయనని అంటే.. అప్పుడు ఈ రోల్ కోసం కమల్ హాసన్.. మోహన్ లాల్ లలో ఒకరిని తీసుకోవాలని అనుకున్నాం. కానీ ఆమిర్ ఖాన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. సెకండ్ ఆప్షన్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేకపోయింది' అని చెబుతోంది నిర్మాణ సంస్థ.
అయితే.. ఏజ్డ్ పాత్రకు ఈ సీనియర్ హీరోలు తగిన న్యాయం చేయగలిగిన.. యంగ్ఏజ్ లో రెజ్లర్ పాత్రలో ఎలా ఉంటారో అని అనుమాన పడిందట యూటీవీ మోషన్ పిక్చర్స్. కానీ ఆమిర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడంతో.. కోలీవుడ్ సీనియర్ స్టార్ కమల్ హాసన్.. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ల వరకూ ఈ ప్రాజెక్టు రాలేదు. అలా ఈ సౌత్ సూపర్ స్టార్స్ దంగల్ ని మిస్ అయారన్న మాట.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/