Begin typing your search above and press return to search.
కమల్-శ్రీదేవి ఓల్డ్ క్లాసిక్ రీమేక్?
By: Tupaki Desk | 24 Nov 2015 4:32 AM GMTబాలు మహేంద్ర దర్శకత్వం వహించిన క్లాసిక్ హిందీ మూవీ -సద్మా. 1983లో ఈ సినిమా రిలీజైంది. తమిళ హిట్ సినిమా మూంద్రమ్ పిరైకి రీమేక్ ఇది. ఓ అందమైన అమ్మాయి తలకు దెబ్బ తగిలి స్పృహ తప్పి పడిపోతుంది. కట్ చేస్తే ఓ బ్రోతల్ హౌస్ లో తేలుతుంది. అక్కడ తనకి ఒంటరిగా ఉన్న ఓ స్కూల్ టీచర్ పరిచయం అయ్యాక ఏం జరిగింది? అన్నదే స్టోరీ.
నాటి మేటి క్లాసిక్ మూవీగా తమిళ్ - హిందీలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన చిత్రమిది. అందుకే ఇప్పుడు ఈ మూవీని తిరిగి రీమేక్ చేసేందుకు రెడీ అవుతున్నారు హిందీ నిర్మాతలు. ఈ చిత్రాన్ని హిందీ - ఇంగ్లీష్ భాషల్లో రీమేక్ చేసేందుకు యాడ్ ఫిలింమేకర్ లాయిడ్ బాప్టిస్టా రెడీ అవుతున్నారు. ముఖేష్ చాబ్రా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. ప్రస్తుతం కాస్టింగ్ ఎంపికలు సాగుతున్నాయి. అయితే ఈ మూవీలో కమల్ హాసన్ - శ్రీదేవి రేంజు లో పెర్ఫామ్ చేసే సత్తా ఉన్న నటీనటులెవరు? అన్నది తేలాల్సి ఉందింకా. ఆ రేంజు పెర్ఫామెన్స్ ఇచ్చే హీరో హీరోయిన్ కోసం వెతుకుతున్నారు. ప్రముఖ హీరో - ప్రముఖ హీరోయిన్ అయితేనే బావుంటుందనేది మేకర్స్ భావన.
కాస్టింగ్ ఫైనల్ అయిపోతే ఇక సెట్స్ కెళ్లడమే తరువాయి అని బాప్టిస్టా చెబుతున్నారు. మూంద్రమ్ పిరై చిత్రంలో నటనకు కమల్ హాసన్ జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. అలాంటి క్లాసిక్ ని రీమేక్ చేస్తూ సాహసం చేస్తున్నారు. మెప్పించకపోయినా.. చెడగొట్టకపోతే చాలు.