Begin typing your search above and press return to search.

భారతీయుడు బాడీ రెడీ చేస్తున్నాడు

By:  Tupaki Desk   |   19 Oct 2017 5:03 AM GMT
భారతీయుడు బాడీ రెడీ చేస్తున్నాడు
X
సినిమా కోసం.. సినిమాలో ప్రేక్షకులను మెప్పించేలా కనిపించడం కోసం ఎంత శ్రమకైనా వెరవని నటుడు కమల్ హాసన్. పాత్రకు తగ్గట్టు తనను తాను మార్చుకోవడం ఆయనకు అలవాటు. అందుకే ఆయన సినిమాలు.. అందులోని పాత్రలు ప్రేక్షకులకు సంవత్సరాల తరబడి గుర్తుండిపోతాయి. దేశం గర్వించదగిన గొప్ప నటుడైన కమల్ తన కెరీర్ లో మైలురాయిగా నిలిచిపోయిన భారతీయుడు సినిమా సీక్వెల్ తో ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమవుతున్నాడు.

శంకర్ దర్శకత్వంలో రెండు దశాబ్దాల క్రితం వచ్చిన భారతీయుడు ఎన్నో సంచలనాలు సృష్టించింది. మళ్లీ ఇన్నాళ్లకు దిల్ రాజు నిర్మాతగా అదే దర్శకుడు - అదే హీరోతో పార్ట్ 2 సిద్ధం చేస్తున్నారు. ఈ పాత్రను కమల్ రిజెక్ట్ చేయడంతో ప్రాజెక్టు తాత్కాలికంగా ఆగిపోయిందని కొద్ది రోజుల క్రితం కోలీవుడ్ లో ఓ పుకారు వచ్చింది. కానీ వాటన్నింటికీ సమాధానం చెప్పే రీతిలో కమల్ హాసన్ మాత్రం భారతీయుడు-2 సినిమా కోసం ప్రిపరేషన్ మొదలెట్టేశాడు. ఫస్ట్ పార్ట్ తరహాలో ఫిట్ గా కనిపించేందుకు డైట్ మార్చడంతో పాటు అందుకు అవసరమైన ఎక్సర్ సైజ్ చేస్తున్నాడట. వర్కవుట్స్ పై సలహాలు ఇచ్చేందుకు యూఎస్ నుంచి ఓ స్పెషల్ ట్రయినర్ ను కూడా తీసుకొచ్చారు. సినిమా స్టార్ట్ చేసేనాటికి పర్ ఫెక్ట్ లుక్ సాధించేలా సీరియస్ ఎఫర్ట్ పెట్టాడు.

కమల్ హాసన్ వెండితెరపై కనిపించి చాలాకాలమైంది. విశ్వరూపం సెకండ్ పార్ట్ వస్తుందని ప్రకటించినా అదో కొలిక్కి రాలేదు. బ్రహ్మానందంతో కలిసి నటించిన శభాష్ నాయుడు అతీగతీ లేకుండా పోయింది. తమిళంలో తూంగవనం (తెలుగులో చీకటిరాజ్యం) రిలీజై రెండేళ్లు దాటింది. ఈమధ్య తమిళ్ బిగ్ బాస్ ప్రోగ్రాం హోస్ట్ గా కనిపించాడు. దాదాపుగా కమల్ తెలుగు తెరపై మళ్లీ భారతీయుడు-2 తోనే కనిపించే అవకాశం ఉంది. అభిమానులు అప్పటివరకు ఎదురుచూడాల్సిందే.