Begin typing your search above and press return to search.
జాతీయ ఉత్తమ దర్శకుడితో కమల్ హాసన్ భారీ ప్రయోగం?
By: Tupaki Desk | 1 July 2021 4:30 AM GMT`ఆడుకళం` లాంటి జాతీయ ఉత్తమ చిత్రాన్ని తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు పొందిన జాతీయ ఉత్తమ దర్శకుడు వేట్రిమారన్ తో విశ్వనటుడు కమల్ హాసన్ భారీ ప్రయోగానికి సిద్ధమవుతున్నారా? అంటే అవుననే సమాచారం. దాదాపు 100 కోట్ల బడ్జట్ తో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ఓ పాపులర్ తమిళ నవల స్ఫూర్తి అని తెలిసింది.
గోపురం ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. మహమ్మారి అనంతరం ఊహించని కలయికగా తమిళ మీడియా కథనాలు వెలువరించింది. దిగ్గజ నటుడు కమల్ హాసన్ తమిళనాడు సాధారణ అసెంబ్లీ ఎన్నికలు 2021 లో ఎదురుదెబ్బ తిన్న తరువాత సినిమాల వైపు తన ఆసక్తిని మలుచుకున్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు సంతకాలు చేస్తున్నారు.
లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో `విక్రమ్` చిత్రంలో కమల్ హాసన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. కనగరాజ్ తర్వాత ఏస్ తమిళ దర్శకనిర్మాత వెట్రీ మారన్ తో పని చేస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. కమల్ హాసన్ .. వెట్రీ మారన్ ఇద్దరూ కోలీవుడ్ లో తమకంటూ ఒక సముచిత స్థానాన్ని ఏర్పరచుకోవడంతో తాజా వార్త తమిళ వినోద పరిశ్రమ హెడ్ లైన్స్ లో ప్రముఖంగా హైలైట్ అయ్యింది.
తమిళ చిత్ర పరిశ్రమలో చాలా మంది దర్శకులకు కమల్ తో పని చేయడం అన్నది ఒక డ్రీమ్. గౌతమ్ వాసుదేవ్ మీనన్ .. లోకేష్ కనగరాజ్ సహా ప్రముఖ దర్శకులంతా కమల్ హాసన్ చిత్రాల నుండి ప్రేరణ పొందిన తరువాత ఫిలింమేకింగ్ లో అడుగుపెట్టారు. మరొక వైపు వెట్రీ మారన్ తన చిత్రాల మేకింగ్ కి మూలాలను బాలూ మహీంద్రలో కనుగొన్నారు. బాలూ మహేంద్రతో కమల్ హాసన్ అనుబంధం ఎంతో గొప్పది. ఆయన తన సలహాదారులలో ఒకరిగా భావించారు కమల్. బాలు మహీంద్రా - కమల్ హాసన్ కల్ట్-క్లాసిక్ మూండ్రామ్ పిరై (1982) నాడు ఒక సంచలనం. రెండు జాతీయ అవార్డులను గెలుచుకున్న చిత్రమిది. ఉత్తమ నటుడు.. ఉత్తమ సినిమాటోగ్రఫీ అవార్డులు దక్కాయి. ఇప్పుడు వేట్రి లాంటి జాతీయ ఉత్తమ దర్శకుడితో పని చేస్తే అది సంచలనమే అవుతుందని భావిస్తున్నారు.
కమల్ .. వేట్రి ఎవరికి వారు కెరీర్ పరంగా బిజీగా ఉన్నందున ఈ కలయిక కాస్త ఆలస్యం కావొచ్చని ఊహాగానాలు సాగుతున్నాయి. కమల్ హాసన్ వరుసగా విక్రమ్- ఇండియన్ 2- శభాష్ నాయుడు- పాపనాశం2 వంటి చిత్రాలు చేస్తున్నారు. మరోవైపు వెట్రీ మారన్ ప్రస్తుతం సూరి- విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న `విదుతలై`తో బిజీగా ఉన్నారు. సూర్య హీరోగా వి క్రియేషన్స్ బ్యానర్ మూవీ వెట్రి మారన్ వాది వాసల్ ని పూర్తి చేయాల్సి ఉంది.