Begin typing your search above and press return to search.

మ‌హాభార‌తంపై క‌మ‌ల్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు!

By:  Tupaki Desk   |   17 March 2017 1:27 PM IST
మ‌హాభార‌తంపై క‌మ‌ల్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు!
X
ద‌శావ‌తారం పేరిట భారీ బ‌డ్జెట్ చిత్రం తీసి యావ‌త్తు దేశం దృష్టిని ఆక‌ర్షించిన క‌మ‌ల్ హాస‌న్‌... ఇప్పుడు వివాదాల‌కు కేంద్ర బిందువుగా మారాడు. విశ్వ‌రూపం చిత్రం ద్వారా ముస్లింల‌లో ఆగ్ర‌హావేశాల‌కు కార‌ణ‌మైన క‌మ‌ల్‌... ఇప్పుడు వ‌రుస కామెంట్ల‌తో హిందువుల‌కు కోపం తెప్పిస్తున్నాడు. తాజా వివాదంలోకి వెళితే... హిందువులు ప‌విత్ర గ్రంథంగా భావించే మ‌హాభార‌తంపై క‌మ‌ల్ నోరు పారేసుకున్నాడు. ఓ త‌మిళ ఛానెల్ కు ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూ సంద‌ర్భంగా క‌మ‌ల్ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు త‌మిళ‌నాడులోని హిందువుల‌ను ఆగ్ర‌హావేశాల‌కు గురి చేస్తున్నాయి.

మ‌హాభారతం పేరు ఎత్త‌కుండానే క‌మ‌ల్ చేసిన వ్యాఖ్య‌లు... అత‌డి ఉద్దేశ్యాన్ని బ‌య‌ట‌పెట్టేశాయ‌ని చెప్పొచ్చు. అయినా క‌మ‌ల్ చేసిన వ్యాఖ్య‌ల విష‌యానికి వ‌స్తే... మ‌హాకావ్యంగా భావించే ఆ మ‌హా గ్రంథంలో ఓ మ‌హిళ తీవ్ర అన్యాయానికి గురైపోయింది. అయినా భార‌త్ దానిని ఇంకా గౌర‌విస్తూనే ఉంది అని క‌మ‌ల్ వ్యాఖ్యానించాడు. ఈ విష‌యం తెలిసిన వెంట‌నే త‌మిళ హిందూ సంస్థ హిందూ మ‌క్క‌ల్ క‌చ్చి (హెచ్ ఎంకే) తీవ్ర ఆగ్ర‌హం వ్యక్తం చేసింది. వెనువెంట‌నే ఈ విష‌యాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లిన ఆ సంస్థ‌... చెన్నై న‌గ‌ర పోలీసు క‌మిష‌న‌ర్ కార్యాల‌యంలో క‌మ‌ల్‌ పై ఫిర్యాదు చేసింది. త‌మ మ‌నోభావాలు దెబ్బ తీసేలా వ్యాఖ్య‌లు చేసిన క‌మ‌ల్ పై త‌క్ష‌ణ‌మే కేసు న‌మోదు చేసి క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆ సంస్థ ప్ర‌తినిధులు డిమాండ్ చేశారు.

ఇదిలా ఉంటే... ఇదే విష‌యంపై కోయంబ‌త్తూరుకు చెందిన హిందూ సంస్థ అఖిల హిందూ మ‌హాస‌భ కూడా ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. భార‌తీయులంతా మ‌హా గ్రంథంగా భావించే మ‌హాభార‌తంపై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన క‌మ‌ల్‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆ సంస్థ జిల్లా క‌లెక్ట‌ర్‌ కు ఫిర్యాదు చేసింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/