Begin typing your search above and press return to search.

ప్ర‌ముఖ న‌టుడి వీలునామాలో ఉంది ఇదేనా?

By:  Tupaki Desk   |   19 May 2017 5:15 AM GMT
ప్ర‌ముఖ న‌టుడి వీలునామాలో ఉంది ఇదేనా?
X
విశ్వ క‌థానాయుడిగా.. విల‌క్ష‌ణ న‌టుడిగా పేరున్న క‌మ‌ల్ హాస‌న్ కు సంబంధించిన ఒక ఆస‌క్తిక‌ర వార్త ఇప్పుడు జోరుగా వినిపిస్తోంది. ఆయ‌న త‌న‌కున్న ఆస్తుల్ని.. త‌న త‌ద‌నంత‌రం ఎవ‌రికి చెందాల‌న్న విష‌యంపై ఒక వీలునామా రాసిన‌ట్లుగా ప్ర‌చారం సాగుతోంది. ప్ర‌ముఖ న‌టుడిగా..నిర్మాత‌గా ద‌శాబ్దాల త‌ర‌బ‌డి ఇండ‌స్ట్రీలో ఉన్నా నాలుగు రాళ్లు వెన‌కేయ‌టంలో మాత్రం వెనుక‌బ‌డే ఉన్నార‌న్న పేరుంది.

త‌న విశ్వ‌రూపం సినిమాకు ఆర్థిక స‌మ‌స్య‌లు వెంటాడిన‌ప్పుడు ఆయ‌న తాను ఉన్న ఇంటిని అమ్మాల‌ని నిర్ణ‌యించుకోవ‌టం ఆయ‌న అభిమానుల్ని క‌దిలించేలా చేయ‌టమే కాదు.. ప‌లువురు తాము ఆర్థిక సాయాన్ని ఇస్తామ‌ని త‌మ‌కు తాముగా ముందుకు రావ‌టం తెలిసిందే.

సుదీర్ఘ‌కాలం సినిమారంగంలో ఉన్నా.. నాలుగు రాళ్లు వెన‌కేసుకోవ‌టం తెలీదంటూ ఆయ‌నకు స్నేహితుడు.. స‌న్నిహితుడు ర‌జ‌నీకాంత్ వ్యాఖ్య‌లు చేయ‌టం తెలిసిందే. ఇటీవ‌ల కాలంలో త‌మిళ‌నాడులో చోటు చేసుకున్న ప‌రిణామాల నేప‌థ్యంలో.. ఎప్పుడేమైనా జ‌రుగుతుంద‌న్న ఉద్దేశంతో ముంద‌స్తు జాగ్ర‌త్త‌గా ఆయ‌న త‌న ఆస్తుల‌కు సంబంధించిన వీలునామా సిద్దం చేశార‌ని చెబుతున్నారు.

త‌న‌కున్న ఆస్తుల్ని త‌న ఇద్ద‌రు కుమార్తెలు శ్రుతిహాస‌న్‌.. అక్ష‌ర హాస‌న్‌ ల‌కు స‌మానంగా పంచుతూ వీలునామా రాసిన‌ట్లుగా ప్ర‌చారం న‌డుస్తోంది. ఫ్యూచ‌ర్ లో ఆస్తుల‌కు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకూడ‌ద‌న్న ఉద్దేశంతో ఆయ‌నీ వీలునామా రాసిన‌ట్లుగా కోలీవుడ్ కోడై కూస్తోంది. త‌మిళ‌ప‌త్రిక‌లు ఈ విష‌యం మీద పెద్ద ఎత్తున క‌థ‌నాలు అచ్చేస్తున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/