Begin typing your search above and press return to search.
కమల్ హాసన్ త్యాగం చూస్తుంటే షాక్ కొడుతోంది!
By: Tupaki Desk | 22 Feb 2022 1:30 AM GMTఉలగనాయగన్ కమల్ హాసన్ బిగ్ బాస్ సీజన్ నుంచి తప్పుకున్నారు. ఆదివారం నాడు బిగ్ బాస్ తమిళ్ OTT వెర్షన్ అయిన బిగ్ బాస్ తమిళ్ అల్టిమేట్ శాశ్వత సీజన్ నుండి వైదొలగుతున్నట్లు ప్రకటించారు.
ఈ షో నుండి ఎందుకు నిష్క్రమిస్తున్నారో స్పష్టం చేసారు ఆయన.. కమల్ హాసన్ మాట్లాడుతూ... లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న తన చిత్రం విక్రమ్ ప్రొడక్షన్ ఆలస్యం వల్ల బిగ్ బాస్ అల్టిమేట్ షూట్ షెడ్యూల్ తో క్లాష్ ఏర్పడిందని చెప్పారు.
ఇప్పటివరకు బిగ్ బాస్ అల్టిమేట్ తో క్లాష్ రాకుండా విక్రమ్ మూవీ టీమ్ ప్లాన్ చేసిందనే అంతా అనుకున్నారు. అలాగే బిగ్ బాస్ వాళ్లు షో నిర్మాణాన్ని ఖచ్చితంగా ప్లాన్ చేశారని విక్రమ్ చిత్రం ఘర్షణ పడకుండా చూసుకోవాలని కమల్ కోరుకున్నారు. కానీ అది కుదరలేదు. ఈ రెండు ప్రాజెక్ట్ లను ఒకేసారి మ్యానేజ్ చేయడం కమల్ కి ఎలా ఆచరణాత్మకంగా అసాధ్యంగా మారిందో అతను వివరించాడు.
లాక్ డౌన్ సహా కోవిడ్ వల్ల విధించిన పరిమితుల కారణంగా మేము విక్రమ్ నిర్మాణ కార్యకలాపాలను రీషెడ్యూల్ చేయడం వల్ల అనివార్యంగా బిగ్ బాస్ అల్టిమేట్ కోసం కేటాయించాల్సిన తేదీలు వృథా అయ్యాయి.
సినీ పరిశ్రమలోని ప్రముఖ తారలు సాంకేతిక నిపుణుల కలయికలో వచ్చే సన్నివేశాలను పూర్తి చేయడానికి మరికొన్ని రోజుల షూటింగ్ మిగిలి ఉన్న వాస్తవాన్ని పరిగణనలోకి తీసుకుంటే విక్రమ్ మరియు బిగ్ బాస్ రెండింటినీ కలిపి పూర్తి చేయడం ఆచరణాత్మకంగా అసాధ్యం.
పాపులర్ తారలు.. సాంకేతిక నిపుణులు వారి షెడ్యూల్ వారు ఇప్పటికే కలిగి ఉన్న ఇతర కమిట్ మెంట్ లను పరిగణనలోకి తీసుకుని నా కోసం వేచి ఉండేలా చేయడం అన్యాయం. తత్ఫలితంగా నేను ఇప్పుడు బిగ్ బాస్ ఓటీటీ సీజన్ నుండి వైదొలగవలసి వచ్చింది" అని అతను ఒక ప్రకటనలో తెలిపారు.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. కమల్ నటిస్తున్న విక్రమ్ త్వరలో విడుదల కావాల్సి ఉంది. ఇందులో ఫహద్ ఫాసిల్ - విజయ్ సేతుపతితో కమల్ స్క్రీన్ ని షేర్ చేసుకుంటున్నారు. తన కోస్టార్స్ కాల్షీట్లు వృధా కాకూడదని తనకు ఆదాయం తెచ్చే ఓటీటీ షోని వదులుకునేందుకు కమల్ హాసన్ వెనకాడలేదు.
అతడిలో నైతిక విలువకు ఇది నిదర్శనం. స్టార్ చానెల్ కి భారీ ఆదాయం తెస్తున్న తమిళ బిగ్ బాస్ కి పలు దఫాలుగా హోస్టింగ్ నిర్వహించిన కమల్ హాసన్ ఈ షోని విజయవంతంగా రన్ చేస్తున్నారు. ఓటీటీ వెర్షన్ కి చేయాలనుకున్నా కానీ అది వీలుపడలేదు.