Begin typing your search above and press return to search.

డబ్బుల విషయంలో జాగ్రత్త భామలు

By:  Tupaki Desk   |   26 Dec 2017 6:48 AM GMT
డబ్బుల విషయంలో జాగ్రత్త భామలు
X

సావిత్రి.. శ్రీదేవి.. సిల్క్ స్మిత.. షకీల.. వీళ్ళందరికీ ఒక విషయంలో మాత్రం గట్టి సంబంధం ఉంది. కష్టపడి సంపాదించిన డబ్బులన్నీ అయినవారికి కట్టబెడితే.. వారు అవన్నీ తీసేసుకుని.. వీరిని ఇబ్బందుల పాలు చేశారు. ఒక్క శ్రీదేవి మాత్రం బోనీ కపూర్ సాయంతో గట్టెక్కేసింది కాని.. మిగతావాళ్ళెవ్వరూ తేరుకోలేదు. నడిరోడ్డు మీదకు వచ్చేశారు.

ఇప్పుడు ఈ పాత కథలన్నీ ఎందుకు తవ్వాల్సి వస్తోందంటే.. ఒక్కోసారి చాలా బాగా సెటిల్ అయ్యారు అనుకుంటున్న హీరోయిన్ల విషయంలో కూడా అదే తరహాలో సీన్లు పడుతున్నాయి. స్టార్ హీరోయిన్ గా ఎదిగిన శృతి హాసన్ ఉంది చూశారు.. ఆమె తల్లి సారిక కూడా ఒకప్పుడు హీరోయినే. ముందులో బిగ్రేడ్ తరహాలో సినిమాలను చేసిన సారిక.. బికినీ సోకులకు పెట్టింది పేరు. అయితే అప్పట్లో ఆమె గాట్టిగానే సంపాదించింది అని టాక్. కాకపోతే ఆమె కష్టపడి సంపాదించిన డబ్బుతో ముంబయ్ లో ఓ ఖరీదైన నివాసం కొనుక్కుంది. కాని ఆ నివాసాన్ని తన తల్లి పేరు మీద తీసుకుంది. అయితే ఈ మధ్యన చనిపోయిన ఆమె తల్లి.. ఎవరో విక్రమ్ తక్కర్ అనే డాక్టర్ పేరు మీద ఆ ఇంటిని రాసి చనిపోయిందట. ఇప్పుడు ఆ మ్యాటర్ సెటిల్ అయ్యేవరకు.. ఈ లేటు వయస్సులో సారిక ముంబయ్ లో అద్దెకు ఉండాల్సి వస్తోంది. చేతిలో సినిమా ఆఫర్లు కూడా పెద్దగా లేకపోవడంతో.. ఆమెకు ప్రస్తుతం సమస్యలు తలెత్తినట్లే.

అయితే ఈ మ్యాటర్ ను కాస్త పరిష్కరించమని.. తన బెస్ట్ ఫ్రెండ్ నుజాత్ ఖాన్ ను కోరిందట సారిక. ఈ నుజాత్ ఎవరో కాదండోయ్.. అమీర్ ఖాన్ కు కజిన్. హీరో ఇమ్రాన్ ఖాన్ వాళ్ళ మమ్మీ. మరి అమీరుడు ఈ మ్యాటర్లో ఏం చేస్తాడో తెలియదు కాని.. హీరోయిన్లు మాత్రం సంపాదించిన డబ్బుల విషయంలో కాస్త జాగ్రత్తగానే ఉండాలని.. ఆత్మీయులు స్నేహితులు అంటూ ఎవ్వరినీ నమ్మినా కష్టమేనని మరోసారి ప్రూవ్ అవుతోంది.