Begin typing your search above and press return to search.

విశ్వరూపం 2: పాతిక కోట్ల నష్టమా?

By:  Tupaki Desk   |   12 Aug 2018 12:36 PM GMT
విశ్వరూపం 2: పాతిక కోట్ల నష్టమా?
X
కమల్ హాసన్ తాజా చిత్రం 'విశ్వరూపం - 2' ఈమధ్యే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాలుగేళ్ల క్రితమే రిలీజ్ కావలసి ఉన్నా నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ ఫైనాన్సు సమస్యల కారణంగా సినిమా రిలీజ్ కుదరలేదు. కమల్ హాసన్ చొరవతో ఫైనల్ గా సినిమా రిలీజ్ అయింది. మొదటి భాగం పెద్ద హిట్ కాబట్టి సహజంగానే రెండో భాగం పై కుడా మంచి ఆసక్తే కనిపించింది.

కానీ సినిమా మాత్రం అంచనాలను అందుకోలేకపోయిందని రివ్యూస్, మౌత్ టాక్ చెబుతున్నాయి. దీంతో మొదటి రోజునుండే కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి. సాధారణంగా ఏళ్ళకు ఏళ్ళు రిలీజ్ డిలే అయిన సినిమాలు ప్రేక్షకులను మెప్పించే అవకాశం తక్కువ. ఇప్పుడు 'విశ్వరూపం - 2' కూడా అదే పరిస్థితి ఎదుర్కొంటోంది. ఒక లీడింగ్ న్యూస్ పేపర్లో ప్రచురించిన కథనం ప్రకారం ఈ సినిమా రైట్స్ ను కమల్ పర్సనల్ రిక్వెస్ట్ పై రిలయన్స్ సంస్థ కొనడం జరిగిందట. ఇప్పుడు సినిమా పరిస్థితి చూస్తుంటే కనీసం వాళ్ళకు పాతిక కోట్ల రూపాయల నష్టం తప్పేలా లేదట.

సాధారణ ప్రేక్షకులకే కాకుండా, కమల్ అభిమానులకు కూడా సినిమా రుచించక పోవడంతో ఇలా జరిగిందని అంటున్నారు. కమల్ రాజకీయాలపై ఫోకస్ చేస్తున్నాడు కాబట్టి ఇకపై ఒకటో రెండో సినిమాలు తప్ప అయననుండి ఎక్కువ సినిమాలు ఆశించలేము. ఈ సమయంలో ఈ సినిమా రిజల్ట్ కమల్ అభిమానులను నిరాశపరిచేదే.