Begin typing your search above and press return to search.
కోట్లు పోతాయన్నా.. కమల్ రాజీ పడలేదు
By: Tupaki Desk | 29 Oct 2015 3:30 PM GMTకమల్ అంతే మరి. మహా మొండిఘటం. తన సినిమాల విషయంలో అస్సలు రాజీ పడడు. తానేం తీయాలనుకుంటే అది తీస్తాడు. ఎన్ని వివాదాలు తలెత్తినా వెనక్కి తగ్గడు. ఆయన కెరీర్లో ఇందుకు చాలా ఉదాహరణలే కనిపిస్తాయి. తాజాగా విశ్వరూపం, ఉత్తమ విలన్ సినిమాల విషయంలోనూ కమల్ తన కన్విన్షన్ నే నమ్ముకున్నాడు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వెనక్కి తగ్గలేదు. ఇప్పుడు ‘చీకటి రాజ్యం’ విషయంలోనూ తన ప్రత్యేకత మరోసారి చాటుకున్నాడు కమల్.
తమిళనాట అచ్చ తమిళం టైటిళ్లు పెడితే 30 శాతం ఎంటర్ టైన్ మెంట్ ట్యాక్స్ తీసేస్తామని కొన్నేళ్ల కిందట ప్రభుత్వం రిలాక్సేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఐతే టైటిల్ పెట్టడం చాలా చిన్న విషయం కావడంతో, ఈ మధ్య దీనికి ఓ చిన్న మెలిక పెట్టింది. సినిమాకు క్లీన్ యు సర్టిఫికెట్ వస్తేనే ఈ మినహాయింపు వర్తిస్తుందని నిబంధన మార్చింది. దీంతో ఇప్పుడు ‘యు’ సర్టిఫికెట్ తెచ్చుకోవడం పెద్ద సమస్యగా మారిపోయింది.
కమల్ కొత్త సినిమా ‘చీకటి రాజ్యం’ విషయానికి వస్తే.. సినిమాలో కొంచెం వయొలెన్స్ ఉండటంతో దీనికి యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చారు. ఐతే వయొలెంట్ గా ఉన్న కొన్ని సన్నివేశాల్ని తొలగిస్తే ఈ సినిమాకు ‘యు’ సర్టిఫికెట్ వచ్చేది. 30 శాతం ఎంటర్ టైన్ మెంట్ ట్యాక్స్ మిగిలేది. ఈ విషయంలో కొంచెం రాజీ పడమని.. ఆ సన్నివేశాలు తొలగించమని కమల్ కు కొందరు సలహాలిచ్చినా ఆయన మాత్రం వినలేదట. ట్యాక్స్ మినహాయింపు రాకపోయినా పర్వాలేదు, ఆ సన్నివేశాల విషయంలో రాజీ పడేది లేదని తేల్చేశాడట కమల్. దీంతో యు/ఎ సర్టిఫికేటే వచ్చింది. 30 శాతం పన్ను కోత పడుతోంది.