Begin typing your search above and press return to search.

తారక్ మీద లోకనాయకుడి ప్రేమ

By:  Tupaki Desk   |   21 May 2019 7:40 AM GMT
తారక్ మీద లోకనాయకుడి ప్రేమ
X
లోక నాయకుడిగా నటనలో ఎవరూ అందుకోలేని స్థాయికి ఎదిగిన కమల్ హాసన్ అంటే ఇతర హీరోల అభిమానులకు ప్రత్యేక గౌరవం. తెలుగు పరిశ్రమలో ఎందరితోనో సత్సంబంధాలు కలిగిన కమల్ సాధారణంగా ఎవరి పుట్టిన రోజులు వేడుకలకు కాని వాళ్ళ ప్రత్యేకమైన సందర్భాలకు కాని స్పందించడు. అయితే అనూహ్యంగా జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డేకి ట్విట్టర్ సాక్షిగా విష్ చేయడం అందరికి షాక్ ఇచ్చింది.

ఇద్దరూ ఏనాడూ ప్రత్యేకంగా కలుసుకున్న సందర్భాలు లేవు. ఒకటి ఈవెంట్లకు మరొకరు గెస్ట్ గానూ రాలేదు. అలాంటప్పుడు సీనియర్ హీరోలతో మాత్రమే బాండింగ్ ఉన్న కమల్ ఇలా తారక్ ను గుర్తు పెట్టుకోవడం విశేషమే. అంతే కాదు ఇకపై నువ్వు జూనియర్ కాదు సీనియర్ అని నేరుగా చెప్పడం చూస్తే తారక్ స్థాయి తన దృష్టిలో ఎలా ఉందో చెప్పినట్టు అయ్యింది. దీన్ని చూశాక యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఆనందం మాములుగా లేదు. అయితే ఇక్కడో కనెక్షన్ కనిపిస్తోంది.

సౌత్ లో తమిళ్ తెలుగులో బిగ్ బాస్ యాంకరింగ్ మొదలుపెట్టింది ఈ ఇద్దరే. ఆ ఒక్కసారి మాత్రమే కలుసుకునే ఛాన్స్ దక్కింది. ఆ కోణంలో కమల్ తారక్ గ్రీటింగ్స్ చెప్పి ఉండవచ్చు అనే కామెంట్స్ లేకపోలేదు. ఏదైతేనేం కమల్ ఇలా బర్త్ డే విష్ చేయడం స్పెషల్ ప్రివిలేజ్ అనే చెప్పొచ్చు. ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ బ్రేక్ లో ఉన్న జూనియర్ వేడుకలకు దూరంగా ఉన్నాడు. నాన్న హరికృష్ణ కాలం చేసి ఏడాది కూడా పూర్తి కాలేదు కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నాడు