Begin typing your search above and press return to search.
మాజీ ప్రియురాలు వల్ల కమల్ కు కరోనా నోటీసులు
By: Tupaki Desk | 30 March 2020 5:02 AM GMTదేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరోనా పాజిటివ్ అని తెలిసిన వారి ఇంటికి నోటీసులు అంటిస్తున్నారు. అలాగే విదేశాల నుండి వచ్చిన వారిని ఇంటికే పరిమితం అవ్వాలని అధికారులు ఆదేశిస్తూ వారి ఇళ్లు క్వారెంటైన్ లో ఉంది అంటూ నోటీసులు అంటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చెన్నై మున్సిపల్ అధికారులు యూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్ ఇంటికి క్వారెంటైన్ నోటీసులు అంటించడంతో గందరగోళం ఏర్పడినది.
ఈ విషయమై కమల్ స్పందిస్తూ తనకు కరోనా అంటూ వస్తున్న వార్తలపై స్పందిస్తూ అలాంటిది ఏమీ లేదు అంటూ క్లారిటీ ఇచ్చాడు. ఇక కమల్ పార్టీ నాయకులు కొందరు ఈ విషయం గురించి మాట్లాడుతూ గత కొన్ని నెలలుగా కమల్ హాసన్ ఎలాంటి విదేశీ ప్రయాణాలు చేయలేదు. కనుక ఆయనకు క్వారెంటైన్ అక్కర్లేదని మున్సిపల్ అధికారుల అత్యుత్సాహం కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడినట్లుగా వారు అంటున్నారు.
ఇక మున్సిపల్ అధికారులు ఈ విషయమై అధికారులు స్పందిస్తూ... కొన్ని రోజుల క్రితం నటి గౌతమి దుబాయి నుండి ఇండియాకు వచ్చారు. ఆమె పాస్ పోర్ట్ లో ఆ ఇంటి అడ్రస్ ఉన్న కారణంగానే ఆ ఇంటికి నోటీసులు అంటించామంటూ పేర్కొన్నారు. గతంలో కమల్ హాసన్ ఇంకా గౌతమిలు సహజీవనం సాగించిన విషయం తెల్సిందే. సుదీర్ఘ కాలం పాటు వారిద్దరు కలిసి ఉన్నారు. అందుకే ఆమె పాస్ పోర్ట్ లో అడ్రస్ కమల్ ఇంటి అడ్రస్ ఉండి ఉంటుంది. ప్రస్తుతం వీరిద్దరు విడిపోయి ఎవరికి వారు ఒంటరి జీవితాలను గడుపుతున్న విషయం తెల్సిందే.