Begin typing your search above and press return to search.

కొత్త ఏడాది ఇండియ‌న్ -2 గురించి కొత్త క‌బురు

By:  Tupaki Desk   |   1 Jan 2023 4:46 AM GMT
కొత్త ఏడాది ఇండియ‌న్ -2 గురించి కొత్త క‌బురు
X
విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ క‌థానాయ‌కుడిగా శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో `ఇండియన్-2` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసారు. బ్యాలెన్స్ చిత్రీక‌ర‌ణ చ‌క‌చకా సాగుతోంది. వీలైనంత త్వ‌ర‌గా షూట్ మొత్తం పూర్తి చేసి పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో బిబీ అవ్వాలని ప్లాన్ చేస్తున్నారు. ఇటీవ‌లే చెన్నైలో ఓ కీల‌క షెడ్యూల్ ని పూర్తి చేసారు.

దీంతో షూట్ ముగింపు ద‌శ‌కు చేరుకుంది. ఇందులో క‌మ‌ల్ హాస‌న్...ర‌కుల్ ప్రీత్ సింగ్ ...కాజ‌ల్ అగ‌ర్వాల్ స‌హా కీల‌క స‌భ్యులంతా పాల్గొన్నారు. తాజాగా కొత్త షెడ్యూల్ ప్రారంభించేందుకు శంక‌ర్ రంగం సిద్దం చేస్తున్నారు. జ‌న‌వ‌రి తొలి వారంలో త‌దుప‌రి షెడ్యూల్ తిరుప‌తిలో నిర్వ‌హిచ‌నున్నారు. పొంగ‌ల్ వ‌ర‌కూ ఏక‌ధాటిగా షూటింగ్ జ‌రుగుతుందిట‌.

అటుపై పండ‌గ సెల‌వులు తీసుకుని మ‌ళ్లీ తిరిగి షూట్ కి వెళ్ల‌నున్నారు. అప్ప‌టి నుంచి పెండింగ్ షూట్ మొత్తం పూర్త‌య్యే వ‌ర‌కూ ఏక ధాటిగా చిత్రీక‌ర‌ణ‌లో బిజీ కానున్నారని స‌మాచారం. ఎట్టి ప‌రిస్థితుల్లో మార్చి నెల‌ఖ‌రుక‌ల్లా షూట్ పూర్తి చేయాల‌న్న‌ది శంక‌ర్ ప్లాన్ అట‌. అలా పూర్తి చేయ‌గ‌ల్గిన‌ప్పుడే ఆర్ సీ 16వ సినిమా షూటింగ్ కి అంత‌రాయం ఏర్ప‌డ‌ద‌ని..ఆ ర‌క‌మైన ప్రణాళిక‌తో శంక‌ర్ ముందుకెళ్తున్న‌ట్లు తెలుస్తుంది.

షూట్ పూర్త‌యితే మ‌రోవైపు పోస్ట్ ప్రొడ‌క్ష‌నులు వేగ‌వంతం అవుతాయి. అప్పుడ‌ప్పుడు వాటిని చూసుకుంటూ చ‌ర‌ణ్ సినిమా షూట్ లో పూర్తి స్థాయిలో బిజీ అవ్వొచ్చ‌న్న‌ది శంక‌ర్ ప్లాన్ గా తెలుస్తోంది. అలాగే క‌మ‌ల్ చిత్రాన్ని వీలైనంత వేగంగా రిలీజ్ చేయ‌డానికి అవ‌కాశం ఉంటుంది. చ‌ర‌ణ్ సినిమా షూటింగ్ కూడా ఇప్ప‌టికే 70 శాతానికి పైగా పూర్త‌యింది. పెండింగ్ షూట్ మ‌రో రెండు నెల‌ల్లో పూర్తి చేయోచ్చ‌ని భావిస్తున్నారుట‌. మ‌రి అన్ని శంక‌ర్ అనుకున్న విధంగా జ‌రుగుతాయా? మ‌ధ్య‌లో ఏ కార‌ణాల‌తోనైనా షెడ్యూల్ మారుతుందా? అన్న‌ది చూడాలి. `ఇండియ‌న్ -2`ని లైకా ప్రొడ‌క్ష‌న్స్-రెడ్ జైంట్ నిర్మాణ సంస్థ‌లు భారీ బ‌డ్జెట్తో నిర్మిస్తోన్న సంగ‌తి తెలిసిందే.