Begin typing your search above and press return to search.
కమల్ కి ఆడవాళ్లంతే మహా సిగ్గంట
By: Tupaki Desk | 1 March 2016 7:51 AM GMTఈ తరం హీరోయిన్లను కేవలం అందాల ప్రదర్శించే వారిగానే గుర్తిస్తున్నారని అలనాటి హీరోయిన్ సుహాసిని అంటున్నారు. తనతోపాటు రాధిక - రేవతి వంటి 80ల్లో వెలిగిన తారలకు అందంగా కనిపించడంతో, తమ ట్యాలెంట్ ను చూపించే అవకాశం కూడా దక్కిందని.. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని అంటున్నారు సుహాసిని.
సౌత్ లో కంటే నార్త్ లో కొంచెం పరిస్థితి బెటర్ గా ఉందన్నది ఈమె ఉద్దేశ్యం. అక్కడ కూడా మేల్ డామినేషన్ ఉన్నా.. విద్యాబాలన్ - కంగనా రనౌత్ లాంటి తారలు ఫిమేల్ లీడ్ రోల్ ఉండే సినిమాలు చేయగలగుతున్నారు. కానీ ఇక్కడ అలాంటి సినిమాలు చాలా తక్కువ వస్తున్నాయని చెప్పారు సుహాసిని. మెల్లగా హీరోయిన్స్ కూడా ఎక్స్ పోజింగ్ కే పరిమితం అయిపోయే పాత్రలకే అలవాటు పడిపోతున్నారని చెప్పారామె. ఇదిలా ఉంటే.. కమల్ హాసన్ గురించి ఓ సీక్రెట్ పంచుకున్నారు సుహాసిని. కమల్ హాసన్ - సుహాసిని బంధువులే. విశ్వనటుడు ఈమెకు బాబాయ్. కమల్ అన్న చారుహాసన్ కూతురే సుహాసిని. ఈ ఏజ్ లోనూ సినిమాల్లో హీరోయిన్లతో ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ పండించే కమల్.. నిజ జీవితంలో మాత్రం ఆడవాళ్లంటే మహా సిగ్గు పడతాడట. ఆ విషయం స్వయంగా సుహాసినినే చెప్పింది.
'ఆడవారి కళ్లలోకి కూడా కమల్ బాబాయ్ ఎప్పుడూ చూడరు. ఎవరైనా ఆయన ఇంటికి వెళ్లినాసరే.. పలకరింపులు అయిపోగానే.. అక్కడి నుంచి వెళ్లిపోతారు కమల్' అంటూ బాబాయ్ కి సంబంధించిన ఓ పెద్ద సీక్రెట్ చెప్పేశారు సుహాసిని.