Begin typing your search above and press return to search.
ముద్దిచ్చేందుకు కమల్ వంగిన వేళ
By: Tupaki Desk | 29 Jan 2016 9:09 AM GMTవిశ్వ నటుడు కమల్ హాసన్ ఇప్పుడు ట్విట్టర్ లో కూడా జాయిన్ అయిపోయారు. మరి కమల్ చేసే ట్వీట్స్ ఎలా ఉంటాయనే, ఆయన్ని ఫాలో అయేవాళ్లకు ఇప్పుడో ఇండికేషన్ లభించింది. తన కూతురు శృతి హాసన్ ను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకుంటున్న ఫోటోను ట్వీట్ చేశారు కమల్ హాసన్. ఈ ఫోటోతాపాటు కమల్ చేసిన ట్వీట్ ఇంకా సూపర్బ్ గా ఉందని చెప్పాలి.
'సాధారణంగా ముద్దు కోసం నేను ఒంగాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు తనే కొంచెం వంగాక నేను ముద్దు పెట్టుకోవాల్సి వచ్చింది. బహుశా తను హైహీల్స్ వేసుకున్న కారణంగా అనుకుంటా'అని ట్వీట్ చేశారు కమల్. తనలోని రొమాంటిక్ యాంగిల్ ని ట్వీట్ లో కూడా చెప్పారనాల్సిందే. సాధారణంగా కమల్ సినిమాలంటే లిక్ కిస్ లు ఖచ్చితంగా ఉంటాయి. మరి ఆయనేమో ఆజానుబాహుడు. ఈయనకు సమానంగా ఎత్తు ఉండే హీరోయిన్స్ దొరకడం చాలా కష్టమైన విషయం. అందుకే వాళ్లని ముద్దు పెట్టుకోవాల్సి వచ్చినపుడు కమల్ కి వంగాల్సి వస్తుంది. అప్పుడు కొంచెం ఇబ్బందే అనాలి. దాన్నే ఇలా ట్వీట్ రూపంలో చెప్పారు.
కానీ ఆయన కూతురు శృతి హాసన్ మాత్రం తండ్రి అంత ఎత్తు ఉంటుంది. ఆ హైట్ కి తోడు హైహీల్స్ కూడా వేసుకుంటే మరింత పొడుగయిపోతుంది. తండ్రితో బుగ్గ మీద ముద్దు తీసుకోవాలంటే.. ఒంగక తప్పని పరిస్థితి. అదే ఈ ట్వీట్. ఏమైనా.. ఈ తండ్రీ కూతుళ్ల అనుబంధం సూపర్బ్ గా ఉంది. హీరోయిన్ అయినా సరే.. నువ్వు నాకింకా చిన్నపిల్లవే అని ఇలా చెప్పారన్న మాట కమల్ హాసన్.