Begin typing your search above and press return to search.
#బిగ్ బాస్.. కమల్ లుక్ డిజైన్ వెనక ఆమె ఎవరు?
By: Tupaki Desk | 5 Nov 2020 11:30 PM GMTవిశ్వనటుడు కమల్ హాసన్ ప్రస్తుతం తమిళ బిగ్ బాస్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈసారి సీజన్ లో మునుపటి కంటే స్టైలిష్ గా స్మార్ట్ గా ఆయనను డిజైన్ చేసిన తీరు అభిమానుల్లో ఆసక్తికర చర్చకు తావిచ్చింది. వైట్ షర్ట్ .. బ్లాక్ ఫ్యాంట్.. దానిపై లెదర్ బెల్ట్ లుక్ .. కాంబినేషన్ గా గుబురు గడ్డం కోర మీసంతో సంథింగ్ స్పెషల్ గా కనిపించారు. ఇంతకీ ఈ లుక్ డిజైన్ చేసినది ఎవరు? అన్నది ఆరా తీస్తే .. ఏ ఉమెన్ బిహైండ్ స్టైల్ ఎవరో తెలిసిపోయింది. ఆ స్పెషల్ డిజైనర్ పేరు అమృత రామ్.
సెలబ్రిటీ డిజైనర్ గా ఇప్పటికే ఎంతో పాపులారిటీ ఉన్న డిజైనర్ ఆమె. ఈసారి బిగ్ బాస్ సీజన్ ఆద్యంతం సదరు డిజైనర్ పేరు సోషల్ మీడియాల్లోనూ పాపులరవుతుండడం ఆసక్తిని కలిగిస్తోంది. రాబోవు బర్త్ డే కి ఆమె ఇచ్చిన అరుదైన గిఫ్ట్ ఇది అనడంలో సందేహమేం లేదు.
ఇక తమిళ బిగ్ బాస్ జోరు ఏ రేంజులో ఉండబోతోందో కొద్దిరోజుల్లోనే రిపోర్ట్ వెలువడనుంది. అలాగే మరో రెండ్రోజుల్లో కమల్ హాసన్ పుట్టినరోజు సంబరాలకు అభిమానులు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. నవంబర్ 7న ఆయన బర్త్ డే సందర్భంగా శ్రుతి స్వయంగా కమల్ హాసన్ కామన్ డీపీని విడుదల చేసింది. శ్రుతి అభిమానుల మేడ్ ఇమేజ్ ను ట్వీట్ చేసిన అనంతరం యోధుడిలా దుస్తులు ధరించాడు. కమల్ ధరించిన దుస్తులలో అతని రాజకీయ పార్టీ మక్కల్ నీది మయం లోగో కూడా ఉంది.
నా ప్రియమైన తండ్రి -కామల్ హాసన్ పుట్టినరోజు కోసం అభిమానులు ప్రేమతో సృష్టించిన కామన్ డీపీని విడుదల చేయడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను అంటూ శ్రుతి ఎమోషన్ అయ్యింది. భారతీయ చిత్ర పరిశ్రమ పరిపాలకుడు అంటూ ఓ అభిమాని తన ఫ్యానిజాన్ని ఈ సందర్భంగా కామెంట్ రూపంలో ఆవిష్కరించాడు. ముందుగానే పుట్టినరోజు శుభాకాంక్షలు సార్ !! ఇది మీ గొప్ప, అద్భుతమైన సంవత్సరానికి నాంది అని నేను నమ్ముతున్నాను అని మరొక యూజర్ అన్నారు. కమల్ హాసన్ వయసు ఈ ఏడాదితో 66 ఏళ్ళు పూర్తవుతున్నాయి.