Begin typing your search above and press return to search.
ఢిల్లీ గల్లీల్లో విశ్వనటుడి కొత్త స్టూడియో
By: Tupaki Desk | 12 Sep 2015 5:58 AM GMTవిశ్వనటుడు కమల్ హసన్ ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్ ఉన్న నటుడు. దేశ విదేశాల్లో కమల్ సినిమాలు కోట్ల వసూళ్లను రాబడతాయి. అన్నింటికి మంచి మాతృభాష తమిళ్ నాడులో సూపర్ స్టార్ రజనీకాంత్ తర్వాతి స్థానం కమల్ దే. అయితే కోలీవుడ్ లో టాప్ పోజిషన్ ను చేజిక్కించుకోవాలని కమల్ చాలా ప్రయత్నించారు గానీ రజనీ మానియా ముందు వర్కౌట్ కాలేదు. వాణిజ్య రాజధాని అయిన ముంభై లోనూ చక్రం తిప్పాలని ప్రయత్నించారు. అక్కడ లెజెండ్రీ అమితాబ్ ఉండటంతో కామ్ గా ఉండాల్సి వచ్చింది. అందుకే ఈసారి ఏకంగా దేశ రాజధానినే కమల్ టార్గెట్ చేసి తక్షణ కర్తవ్యానికి రెడీ అవుతున్నాడు.
దేశంలో మేజర్ సిటీల్లో తనకి సినిమా స్టూడియోలు ఉండాలనేది కమల్ ప్లాన్. అందులో భాగంగా ఢిల్లీలోనూ తన పేరిట స్టూడియోలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నాడు. ఢిల్లీలో చలన చిత్ర పరిశ్రమ అభివృద్ది చెందే దిశగా చర్యలు తీసుకోవాలని రాష్ర్ట ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను కోరారు. దాదాపు రెండున్నర గంటల పాటు సాగిన ఈ భేటిలో షూటింగులకు అనుమతులు సరళతరం చేయాలని కమల్ కొరారు. దీనికి ఆయన కూడా అంగీకరించారు. దేశ రాజధానిలో ఫిలి ఇండస్ర్టీని బాగా అభివృద్ది పరచాలని ఆయన కూడా హామీ ఇచ్చారు. సినిమా ఇండస్ర్టీ కోసం ప్రత్యేకంగా ఓ విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కేజ్రీవాల్ తెలిపారు.
ఇవన్నీ గనుక సాధ్యమైనంత తొందరగా జరిగితే కమల్ అనుకున్న లక్ష్యాలను ఛేదించలగలడు. ఢి్ల్లీలో కమల్ స్వయంగా సొంత స్టూడియోలు.. సినిమాకు సంబంధించిన అత్యాధునిక టెక్నాలజీలను తీసుకురావాలని భావిస్తున్నారు. ఇప్పటికే డైరెక్ట్ టు హోమ్ ( డి.టి.హెచ్) రూపంలో బుల్లితెర పైకి సినిమాలను తీసుకురావాలని కమల్ ప్లాన్ చేస్తున్నారు. కానీ కొన్ని రాజకీయ శక్తులు అడ్డుకోవడంతో సాధ్యపడలేదు. అప్పట్లో విశ్వరూపం సినిమాను డి.టి.హెచ్ లో విడుదల చేయాలనుకున్నారు గానీ వీలు చిక్కలేదు. ఇలాంటి ప్రపోజల్స్ అన్నీ కేజ్రీవాల్ దృష్టికి తీసుకెళ్లారని తెలుస్తోంది. ఇవన్నీ గనుక సాధ్యమైతే కమల్ పేరు చరిత్రపుట్టల్లో నిలిచిపోవడం ఖాయం.