Begin typing your search above and press return to search.
కమల్ బుద్ధిజంలోకి మారుతున్నాడా?
By: Tupaki Desk | 10 Nov 2015 5:30 PM GMTకమల్ హాసన్ ది ఓ విభిన్న వ్యక్తిత్వం. ఆయన ఇటు భక్తుడూ కాదు.. అటు నాస్తికుడూ కాదు. అలాంటి కమల్.. బౌద్ధ మత గురువు దలైలామాను కలవడం ప్రపంచం మొత్తాన్ని ఆశ్చర్యపోయేలా చేసింది. ఏంటీ కమల్ హాసన్ బుద్ధిజంలోకి మారుతున్నారా అని అనుకునేలా చేసింది. తన మూవీ తూంగావనం రిలీజ్ రోజునే ఈ సంఘటన జరగడం.. మరిన్ని ప్రశ్నలు తలెత్తడానికి కారణమైంది.
అయితే.. దలైలామాను కలవడంపై కమల్ హాసన్ స్పందించారు. తాను ఎలాంటి భక్తిభావంతోనో, లేక సినిమాకి ఉపయోగపడుతుందనో బౌద్ధ మత గురువుని సందర్శించలేదని చెప్పారు. తాను స్వతహాగా గాంధీజీ అభిమానిని కావడంతో.. అహింసకోసం పాటుపడే దలైలామాను కలుసుకున్నానని చెప్పారు కమల్.
తాను సినిమాలు, టీవీ చూడడని దలైలామా చెప్పారని కమల్ అన్నారు. అయితే.. ఈ విశాల విశ్వానికి అహింసకి ఉండే శక్తి ఏమిటో భారత్ తెలియచేసిందని... సినిమాలతో ప్రపంచానికి అహింసను బోధించవచ్చని సూచించారట. ఓ కళాకారుడికి ఆ అవకాశం ఉంటుందని, దానిని ఉపయోగించుకోవాలని చెప్పారట దలైలాలా. ఇకపై ఆ ప్రయత్నం చేస్తానని కమల్ కూడా ఈ సందర్భంగా మాట ఇచ్చారట. 2 వేల సంవత్సరాల క్రితం ఓ తమిళ కవితను బౌద్ధ గురువు గుర్తు చేశారట. దాని అర్ధం 'ప్రతీ ఊరు నా ప్రాంతమే. ప్రతీవారూ నా బిడ్డలే' అని.
అయినా.. హే రామ్ లాంటి సినిమా తీసిన కమల్.. అహింసను బోధించేలా మూవీ తీయాలని అనడం చూస్తుంటే.. కమల్ హాసన్ కి ఏదైనా సాధ్యమే అనిపిస్తోంది.