Begin typing your search above and press return to search.

ఇష్టమైన తెలుగు దర్శకుడిని కలిసిన కమల్ హాసన్

By:  Tupaki Desk   |   23 Nov 2022 12:03 PM GMT
ఇష్టమైన తెలుగు దర్శకుడిని కలిసిన కమల్ హాసన్
X
విక్రమ్ సినిమాతో ఇటీవల విశ్వ నటుడు కమల్ హాసన్ బాక్సాఫీస్ వద్ద సాలీడ్ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఆ సినిమా అనంతరం మళ్ళీ ఇండియన్ 2 పై మరింత ఫోకస్ పెట్టాడు. శంకర్ దర్శకత్వంలో తెరపైకి రానున్న ఆ సినిమా తదుపరి షెడ్యూల్ త్వరలోనే స్టార్ట్ కానుంది. ఇక ఇటీవల హఠాత్తుగా హైదరాబాద్ వచ్చిన కమల్ హాసన్ తెలుగు ప్రఖ్యాత దర్శకుడు కళాతపస్వి కె విశ్వనాథ్‌ని ఆయన స్వగృహంలో కలుసుకున్నారు.

కమల్ హాసన్ కు విశ్వనాథ్ అంటే ప్రత్యేకమైన గౌరవం. ఆయనతో అప్పట్లో స్వాతిముత్యం అనే సినిమా చేసి సౌత్ ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేశారు. అలాగే సాగర సంగమం, శుభ సంకల్పం కూడా అప్పట్లో మంచి విజయాన్ని అందుకున్నాయి. వీరి కలయికలో వచ్చిన ఆ క్లాసికల్ సినిమాలను చూస్తే ఇప్పటికి కూడా బోర్ కొట్టదు. ఇక కె.విశ్వనాథ్ వయసురీత్యా సినిమాలు తీయడం తగ్గించేశారు. ఇక ఆయన ప్రస్తుతం ఇంటిలోనే రెస్ట్ తీసుకుంటున్నారు.

ఈ క్రమంలో ఎప్పటి నుంచో కమల్ హాసన్ తనకు ఇష్టమైమ కె. విశ్వనాథ్ ను కలవాలని అనుకుంటున్నారు. ఇక మొత్తానికి ఇప్పుడు కలిశారు. ప్రత్యేకంగా ఆశీర్వాదం కూడా తీసుకుని వారి కుటుంబ సభ్యులను కూడా కలుసుకున్నారు. కమల్ హాసన్ విశ్వనాథ్ ను ఒక గురువు తరహాలో భావిస్తూ ఉంటారు. ఇక కమల్ హాసన్ విక్రమ్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న అనంతరం తదుపరి సినిమాతో కూడా అదే తారహలో సక్సెస్ అందుకోవాలి అని రెడీ అవుతున్నాడు.

ఇక శంకర్ దర్శకత్వంలో ఎప్పుడో ఫినిష్ కావాల్సిన ఇండియన్ 2 సినిమాను మళ్ళీ మొదలు పెట్టిన విషయం తెలిసిందే. దర్శకుడు శంకర్ ఒకవైపు రామ్ చరణ్ తో 15 వ సినిమాను చేస్తూనే మరోవైపు ఇండియన్ 2 సినిమాను కూడా తెరకెక్కకేస్తున్నారు.

ఇక ఇండియన్ 2 అనంతరం మరికొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్ట్ లను కమల్ సెట్స్ పైకి తీసుకు రానున్నాడు. ఇక లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలోనే విక్రమ్ కు సీక్వెల్ కూడా తీయాలని డిసైడ్ అయ్యారు. అలాగే హెచ్. వినోథ్ దర్శకత్వంలో కూడా కమల్ ఒక సినిమా చేసేందుకు ఒప్పుకున్నాడు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.