Begin typing your search above and press return to search.
తమిళ బిగ్‌బాస్ హౌస్‌లో శ్రీశ్రీ కవిత!
By: Tupaki Desk | 16 Nov 2020 12:10 PM GMTబిగ్‌బాస్ హౌస్ అంటేనే జనాలకు విరక్తి వచ్చేసింది. ప్రారంభంలో ఈ షో అంటే కొంత ఆసక్తి ఉండేది. కానీ ఎంపిక చేస్తున్న సభ్యులు, వారి ప్రవర్తనతీరుతో రోజురోజుకూ ఈ షో పట్ల ప్రజలకు వెగటు పుట్టింది. మిగతా భాషల విషయం తెలియదు కానీ తెలుగులో మాత్రం ఈ సీజన్లో బిగ్‌బాస్ పట్ల ఆసక్తి పూర్తిగా పోయింది. కరోనా లాక్‌డౌన్‌తో జనాలంతా ఇంట్లోనే ఉంటారు కాబట్టి విపరీతంగా రేటింగ్‌లు పెరుగుతాయని నిర్వాహకులు భావించారు. ప్రారంభంలో ప్రేక్షకుల్లో కూడా కొంత ఆసక్తి ఉండేది. కాని రాను రానూ బిగ్‌బాస్ ఇస్తున్న టాస్కులు, సభ్యుల ప్రవర్తన చూసి జనాలకు బోర్ కొట్టింది.
ఈ సారి బిగ్‌బాస్ హౌస్ నిర్వాహకులు ఏ మాత్రం కసరత్తు చేయకుండా టాస్కులు పెట్టడమే అందుకు కారణం. కేవలం శని, ఆదివారాల్లో మాత్రం బిగ్‌బాస్‌కు కొంతమేర రేటింగ్ కనిపిస్తుంది. అయితే తమిళనాడు బిగ్‌బాస్‌కు మాత్రం ఓ రేంజ్ క్రేజ్ ఉన్నది. అక్కడ హోస్టింగ్ చేస్తున్నది మహానటుడు కమల్‌హాసన్ కావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది.
కమల్ హాసన్ అక్కడ బాగానే రాణిస్తున్నారు. తమిళనాడులోనూ బిగ్‌బాస్ హౌస్‌లో అనామకులను ఇంటి సభ్యులుగా తెచ్చిపెట్టారు. అయినప్పటికీ కమల్‌హాసన్ షోను కొంతమేర రక్తి కట్టిస్తున్నాడు. అయితే తాజాగా కమల్‌హాసన్ అక్కడి బిగ్‌బాస్ హౌస్‌లో మహాకవి శ్రీశ్రీ కవితను చదివి వినిపించారు. ఈ శతాబ్ధం నాది అని ప్రకటించిన ఓ యుగకవిని తెలుగు ప్రేక్షకులు, సినిమావాళ్లు, ప్రభుత్వాలు విస్మరించిన వేళ.. ఓ తమిళ నటుడు స్పందించడం.. శ్రీశ్రీ పేరును బిగ్‌బాస్ హౌస్‌లో ప్రస్తావించడం.. శ్రీశ్రీ కవితను వినిపించడం నిజంగా తెలుగువాళ్లకు గర్వకారణం.
మహాకవి శ్రీశ్రీ మహాప్రస్థానంలో భాగమైన 'పతితురాల భ్రష్టులారా..' అనే కవితను కమల్ బిగ్‌బాస్ హౌస్‌లో వినిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.తమిళంలో భారతియర్ లాగే తెలుగులో మహాకవి శ్రీశ్రీ అని కమల్ పోలిక పెట్టారు. మహాప్రస్థానాన్ని కీర్తిస్తూ కమల్ ఒక కవిత అలవోకగా చెప్పారు. తెలుగును సుందర తెలుంగు అని భారతియర్ కీర్తించిన వైనాన్ని కూడా కమల్ ప్రస్తావించారు. కమల్ నటించిన పలు సినిమాల్లో శ్రీశ్రీ ప్రస్తావన ఉంటుంది. ఆకలిరాజ్యం తమిళ వెర్షన్ లో సుబ్రమణ్య భారతి కవితలను వల్లెవేస్తూ ఉంటాడు హీరో. అదే సినిమా తెలుగు వెర్షన్లో మహాకవి శ్రీశ్రీ కవితలను సందర్భానుసారం ఉపయోగించారు. అలాగే మహానది సినిమా డబ్బింగ్ వెర్షన్లో శ్రీశ్రీ కవితలు వినిపిస్తాయి. ఇంద్రుడు చంద్రుడులో క్లైమాక్స్ లో శ్రీశ్రీ కవితలు చెబుతాడు కమల్. అయితే మహాకవి శ్రీశ్రీని తెలుగు సినిమావాళ్లు గుర్తుచేసుకోవడం చాలా తక్కువ. అటువంటి ఓ తమిళనటుడు శ్రీశ్రీ కవితలను ప్రస్తావించడం గొప్పవిషయం.