Begin typing your search above and press return to search.
నగ్న సత్యం చెప్పిన కమల్
By: Tupaki Desk | 20 Nov 2015 4:21 AM GMTలోకనాయకుడు కమల్ హాసన్ సినిమా పరిశ్రమకు దక్కిన ఓ ప్రయోగశాల. తెరపై హీరోగా విభిన్న పాత్రలు పోషించడమేకాదు. తెర వెనుక టెక్నీషియన్ గా సైతం దర్శకుడిగా, నిర్మాతగా, గాయకుడిగా వేర్వేరు పాత్రలు పోషించి కళామతల్లి ముద్దుబిడ్డగా మన్ననలను అందుకుంటున్నారు. ఆయన నటించిన చీకటి రాజ్యం నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా జరిగిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన మాటలు ఆశ్చర్యపరిచాయి.
మీ సినీ ప్రయాణంలో సంపాదన ఎంత అన్న ప్రశ్నకు ప్రతీదాన్ని డబ్బుతో వెలకట్టకూడదని, ప్రేక్షకుల చప్పట్లకు ఎన్ని కోట్ల వెల వుందని, అంతేకాక ఓ సాధారణ వకీలు కొడుకుని ఇంటర్వ్యూ చెయ్యడానికి ఇన్ని పత్రికలు రావడం వెనుక ఎంత వెల వుందని ఎదురు ప్రశ్నించాడు.
ప్రేక్షకులు మిమ్మల్ని లోకనాయకుడిగా కీర్తిస్తారు.. ఆ ప్రభావం మీపై వుంటుందా అన్న ప్రశ్నకు వీధిలో అడుక్కునేవాడు కూడా తన సొంత బిడ్డను మహారాజా అని పిలవాలని కోరుకుంటాడు. కానీ ఆ పిల్లాడు అలా ఫీల్ అవ్వకూడదు. అలాగే ప్రేక్షకులు నన్ను అలా పిలిచినా నిజంగా నాకా అర్హత వుందాని ప్రశ్నించుకోవాలని గొప్ప నగ్న సత్యం చెప్పారు కమల్..