Begin typing your search above and press return to search.
రహమాన్ ఇచ్చిన ఆ పాట నాకు అస్సలు నచ్చలేదు!
By: Tupaki Desk | 14 Jun 2020 1:30 PM GMTభారతదేశం గర్వించదగ్గ సంగీత దర్శకుడు ఏఆర్ రహమాన్. ఆస్కార్ అవార్డు దక్కించుకున్న ఆయన గొప్ప సంగీత దర్శకుడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. తన సంగీతంతో ప్రపంచ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఏఆర్ రహమాన్ పై కమల్ హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇటీవలే కమల్ హాసన్ మరియు ఏఆర్ రహమాన్ లు ఒక లైవ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు తమ కెరీర్ లో ఎదుర్కొన్న ఒడిదొడుకులు మరియు సక్సెస్ ల గురించి ప్రస్థావించడం జరిగింది.
ఈ సందర్బంగానే రహమాన్ ముందు కమల్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అయ్యాయి. రహమాన్ పాటలు మొదట్లో నాకు పెద్దగా నచ్చేవి కాదు. నాకు ఎక్కువగా ఇళయరాజా గారి పాటలు ఇష్టం ఉండేవి. రహమాన్ పాటలకు అలవాటు పడేందుకు సమయం పట్టింది. ఇండియన్ సినిమాకు రహమాన్ ట్యూన్ చేసిన ఒక పాట అస్సలు నచ్చలేదు. ఆ పాట విషయంలో శంకర్ వద్ద అసంతృప్తి కూడా వ్యక్తం చేశాను. కాని ఆయన మాత్రం చాలా నమ్మకంగా సినిమాలో ఆ పాటను ఉంచారు.
పాట చిత్రీకరణ పూర్తి అయ్యి ఫైనల్ మిక్సింగ్ తర్వాత వింటే చాలా బాగా నచ్చింది. ప్రేక్షకులు కూడా ఆ పాటను తెగ అభిమానించారు అంటూ కమల్ హాసన్ గతంను గుర్తు చేసుకున్నాడు. ప్రస్తుతం వీరిద్దరు కలిసి ‘తలైవాన్ ఇరుక్కిన్‌ద్రాన్’ చిత్రం చేస్తున్నారు. రాజకీయాలతో బిజీగా ఉంటున్నా కూడా సినిమాలను వరుసగా చేస్తున్న కమల్ హాసన్ మరో వైపు ఇండియన్ 2 చిత్రాన్ని కూడా చేస్తున్న విషయం తెల్సిందే.