Begin typing your search above and press return to search.

వేల తప్పులు చేశానంటున్న కమల్

By:  Tupaki Desk   |   4 Nov 2015 5:30 PM GMT
వేల తప్పులు చేశానంటున్న కమల్
X
ఇంకో రెండు రోజుల్లో 61 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్నాడు కమల్ హాసన్. ఇందులో 55 ఏళ్లకు పైగా జీవితాన్ని సినిమాలకే అంకితం చేశాడాయన. ఆయన నటన గురించి, పోషించిన పాత్రల గురించి, చేసిన ప్రయోగాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. భారత దేశం గర్వించదగ్గ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారాయన. మరి ఇంత సుదీర్ఘమైన, గొప్ప ప్రస్థానాన్ని విశ్లేషించుకుంటే ఎలా ఉంటుంది అని అడిగితే.. కమల్ ఏమన్నాడో తెలుసా?

‘‘ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అన్నీ తప్పులే కనిపిస్తాయి. ఒకటీ రెండూ కాదు.. వేల తప్పులు. అందుకే వెనక్కి తిరిగి చూసుకోను. మున్ముందుకు వెళ్లిపోవడమే. ‘ఇక అయిపోయింది చేయడానికి ఏం లేదు’ అని అనుకుంటే చాలా కష్టం. మనమే అలా అనుకుంటే శివాజీ గణేషన్ గారు ఇంకేమనుకోవాలి. ఆయన చేయని పాత్ర ఉందా? అయినా ఇప్పుడు ఆయన కోసం నేనో కొత్త పాత్ర సృష్టించగలను. నేను నటించిన ప్రతి చిత్రమూ ప్రత్యేకమైందేం కాదు. నేను చేసిన వాటిలో సగానికి పైనే రెగ్యులర్ సినిమాలున్నాయి. కాబట్టి నేను చేయాల్సిన పాత్రలు, సినిమాలు ఇంకా ఎన్నో మిగిలి ఉన్నాయి’’ అని కమల్ చెప్పాడు.

తన కెరీర్లో చాలా రకాల సినిమాలూ చేశానని.. ఐతే పౌరాణికాలు చేయలేదని, దేవుడి మీద నమ్మకం లేకపోవడమే దానికి కారణమని.. ఐతే ఒకప్పుడు ‘లంకేశ్వరుడు’ అనే ఓ పౌరాణిక స్క్రిప్టు తయారు చేసుకున్నానని.. అది కార్యరూపం దాల్చలేదని, భవిష్యత్తులో ఆ సినిమా తీసే అవకాశాలు లేకపోలేదని కమల్ వెల్లడించాడు.