Begin typing your search above and press return to search.
కమల్ కుమ్మేస్తున్నాడు
By: Tupaki Desk | 2 Oct 2015 3:30 PM GMTఈ అక్టోబరు నవంబరు మాసాల్లో తెలుగులో బోలెడన్ని సినిమాలు రాబోతున్నాయి. ఆ సందడిలో కమల్ సినిమా నిలదొక్కుకుంటుందా? అసలు ఆ సినిమాకి బిజినెస్ అయినా అవుతుందా? అనే సందేహాలు ఇండస్ట్రీలో వ్యక్తమయ్యాయి. కానీ కమల్ మాత్రం అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అదరగొడుతున్నాడు. ఆయన కథానాయకుడిగా నటిస్తూ నిర్మించిన `చీకటిరాజ్యం` బిజినెస్ విషయంలో కుమ్మేస్తోంది. సుధీర్ఘకాలం తర్వాత కమల్ నేరుగా చేసిన తెలుగు సినిమా ఇదే కావడం విశేషం.
ఆర్డినరీ కథలతో తెలుగు సినిమాలు చేయకూడదనుకొన్నాననీ, చీకటిరాజ్యంలాంటి ఎక్స్ స్ట్రార్డినరీ కథ దొరకడంతోనే ఇక్కడ చేస్తున్నానని ఇటీవల విలేకర్ల సమావేశంలో వెల్లడించాడు కమల్. ఆ స్టేట్ మెంట్ బిజినెస్ వర్గాల్ని బాగా ఆకట్టుకుంది. కమల్‌లాంటి నటుడు ఎక్స్ స్ట్రార్డినరీ కథ అంటున్నాడంటే సినిమాలో సమ్ థింగ్ ఏదో ఉందన్న సంకేతం బిజినెస్ వర్గాల్లోకి వెళ్లింది. పైగా కమల్ ఈ సినిమాకి చేస్తున్న ప్రచారం కూడా ఆకట్టుకుంటుంది. మామూలుగా ఎవరైనా సినిమాని విడుదల చేసే ముందే ప్రమోషన్ చేయాలనుకొంటారు. కానీ కమల్ మాత్రం సినిమా విడుదలకు నెలన్నర సమయం ఉన్నప్పటికీ ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టాడు. కేవలం 24 గంటల్లోనే 23 ఛానళ్లకు ఇంటర్వ్యూ లు ఇచ్చి రికార్డు సృష్టించాడు. దీంతో సినిమాలో ఎంత దమ్ముందన్న విషయం ఆ ఇంటర్వ్యూల ద్వారా బయటికొచ్చింది. దీంతో సినిమా డొమెస్టిక్ బిజినెస్ తో పాటు, ఓవర్సీస్ బిజినెస్ కూడా పూర్తి చేసుకొన్నట్టు తెలుస్తోంది.
తమిళ్ లో స్థిరపడిన ఓ తెలుగబ్బాయి రాజేష్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ `చీకటిరాజ్యం` తీశాడు కమల్. సినిమా మొత్తం స్టైలిష్ గా, ఓ థ్రిల్లర్ కథతో తీశాడు. పక్కా స్క్రిప్టుతో సెట్ లోకి దిగడంతో సినిమాని తెలుగు - తమిళ భాషల్లో 50 రోజుల్లోనే పూర్తి చేశాడట. `మరో చరిత్ర` - `ఆకలిరాజ్యం` - `సాగరసంగమం`లాంటి చిత్రాలు ఆ ట్రెండ్ లో ఎలాంటి పేరు తీసుకొచ్చాయో, ఈ ట్రెండ్‌కి తగ్గట్టుగా `చీకటిరాజ్యం` కూడా అలాంటి పేరే తీసుకొస్తుందని కమల్ నమ్మకంగా చెబుతున్నాడు. అన్నట్టు ఆయనకి తెలుగు సినిమా నిర్మాణం - వ్యాపారం బాగా నచ్చడంతో తదుపరి సినిమాని కూడా తెలుగులోనే చేస్తానని ప్రకటిస్తున్నాడు.