Begin typing your search above and press return to search.
షారుఖ్ కు షాకిచ్చేలా కమల్ కామెంట్స్!
By: Tupaki Desk | 12 Aug 2016 11:33 AM GMT2009లో న్యూ జెర్సీలోని నెవార్క్ లిబర్టీ విమానాశ్రయం.. 2012లో న్యూయార్క్ ఎయిర్ పోర్టు.. తాజాగా లాస్ ఏంజిల్స్ విమానాశ్రయం! విమానాశ్రయాలు మారినా - ఏళ్లు గడిచినా - పేరు ప్రఖ్యాతులు పెరుగుతున్నా అమెరికాలో షారుక్ ఖాన్ కు అవమానాలు మాత్రం తప్పడంలేదు. పేరు చివర ఖాన్ ఉండటమే షారుక్ చేసిన నేరమా లేక మరేమైనా కారణమా అనేది తెలియదు కానీ.. అమెరికా వెళ్లిన ప్రతిసారీ షారుక్ కు చేదు అనుభవమే ఎదురవుతుంది. తాజాగా అమెరికా వెళ్లిన షారుఖ్ ను లాస్ ఏంజిల్స్ విమానశ్రయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈసారి కూడా చాలా సమయం షారుఖ్ ను అదుపులో ఉంచుకున్న పోలీసులు అనంతరం విడిచిపెట్టారు. ఈ విషయాలను బాలీవుడ్ బాద్ షా తన ట్విట్టర్ లో పేర్కొన్నారు.
ఈ ఘటనపై స్పందించిన భారత్ లోని అమెరికా రాయబారి రిచర్డ్.. షారుక్ కు క్షమాపణలు చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు ఎదురుపడకుండా చూస్తామని ట్వీట్ చేశారు. అయితే వీటిపై స్పందించిన షారుఖ్... భద్రత విషయంలో చెక్కింగులు తాను అర్థం చేసుకుంటానని, అయితే అమెరికా వెళ్లిన ప్రతీసారి ఇలా జరగడం దారుణమని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ విషయాలపై స్పందించిన బాలీవుడ్ ప్రముఖులు వారి వారి అనుభవాలను కూడా షేర్ చేసుకుంటూ షారుఖ్ ని ఓదార్చే పనిలో ఉన్నారు. అమెరికా ఎప్పుడూ ఇలానే చేస్తుందని, ఆసియావారైతే చాలు అనుమానించడం - పేరు చివర ఖాన్ ఉంటే ఆ పని కాస్త ఎక్కువగా చేయడం చేస్తున్నారని చెప్పుకొస్తున్నారు. వీరందరి సంగతి అలా ఉంటే.. లోకనాయకుడు కమల్ హాసన్ మాత్రం ఈ విషయంపై కాస్త భిన్నంగా స్పందించారు.
లాస్ ఏంజిల్స్ ఎయిర్ పోర్టులో అమెరికా అధికారులు షారుఖ్ ను అదుపులోకి తీసుకొని.. కాసేపు ఇబ్బంది పెట్టిన ఘటనపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. కమల్ మాత్రం ఇందులో తప్పేం లేదని చెబుతున్నారు. ఎవరి పని వాళ్లు చేసుకుంటూపోవడం మంచి లక్షణమని - ఆ విషయంలో అమెరికా చేసింది కూడా అదేనని అన్నారు. అమెరికా అధికారులు వారి వారి నిబంధనలను వారు తూచా తప్పక పాటిస్తున్నారని, షారుక్ అయినా కమల్ అయినా వారికి ఒకటే అని.. ఏ ఒక్కరినీ ప్రత్యేకంగా పరిగణించకుండా ఉండటం వారి వ్యవహారశైలని కమల్ పేర్కొన్నారు. ఇదే సమయంలో ఈ ఖాన్.. షారుఖ్ ఖాన్ కాబట్టి - మనదేశంలో సూపర్ స్టార్ కాబట్టి మనవాళ్లు కాస్త అతిగా స్పందించాల్సిన అవసరం లేదని, షారుఖ్ కూడా ఈ విషయాన్ని పెద్ద సీరియస్ గా తీసుకుని ఉండడని కమల్ అభిప్రాయపడ్డాడు. ఇదే సమయంలో అభిమానులపై కూడా స్పందించిన కమల్.. షారుఖ్ అభిమానులు ఈ విషయంపై కాస్త గాయపడి ఉండొచ్చు కానీ... అమెరికా ఏకంగా ఒక గాయపడిన దేశమే అని, వారి జాగ్రత్తలో వారు ఉండటం తప్పేమీ కాదని తెలిపారు. ఏది ఏమైనా.. షారుఖ్ కి జరిగింది అవమానమే అనేవారు కొందరైతే.. కమల్ చెప్పిందే ప్రాక్టీకల్ గా వాస్తవం అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు!