Begin typing your search above and press return to search.

ఇలా అయితే కష్టమే కమల్!

By:  Tupaki Desk   |   24 July 2018 8:57 AM GMT
ఇలా అయితే కష్టమే కమల్!
X
మొన్న విడుదల చేసిన పోస్టర్ ప్రకారమైతే విశ్వరూపం 2 విడుదలకు కేవలం 17 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. కానీ దాని తాలూకు సందడి ఎక్కడా కనిపించడం లేదు సరికదా అభిమానులకు తప్ప రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయిన విషయం సాధారణ ప్రేక్షకులకు ఇంకా తెలియదు. ఆగస్ట్ 10 తమిళ్ తో పాటు తెలుగులో ఏకకాలంలో విడుదల చేస్తున్నట్టు సైలెంట్ గా అనౌన్స్ చేసిన కమల్ పబ్లిసిటీ విషయంలో చూపిస్తున్న నిర్లక్ష్యం ఓపెనింగ్స్ పై ప్రభావం చూపడం ఖాయం. నిజానికి విశ్వరూపం ఫస్ట్ పార్ట్ వచ్చి చాలా కాలమైన నేపధ్యంలో అందరు దాన్ని దాదాపుగా మర్చిపోయారు. పైగా భారతీయుడు లాగా హిస్టరీ క్రియేట్ చేసి ఇంపాక్ట్ చూపించిన సినిమా కాదు. టిపికల్ సబ్జెక్ట్ ని హ్యాండిల్ చేసిన విధానానికి మంచి పేరుతో పాటు ఓ మాదిరి వసూళ్లు కూడా దక్కాయి . కానీ ఇప్పుడు రెండో భాగానికి గ్యాప్ వచ్చిన నేపధ్యం బజ్ లేకపోవడానికి కారణం అవుతోంది. ట్రైలర్ అచ్చం ఫస్ట్ పార్ట్ లాగే ఉందనే ఫీలింగ్ కలిగించడం కూడా ఒకరకంగా హైప్ ని దెబ్బ తీస్తోంది. ఇన్ని ప్రతికూలతల మధ్య విశ్వరూపం 2కి అంచనాలు పెంచే పనిని ఇప్పటిదాకా తలకెత్తుకోకపోవడం వింతే.

ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే విశ్వరూపం విడుదలైనప్పుడు జరిగిన హంగామా మామూలుది కాదు. ఒకపక్క తమిళనాడులో బ్యాన్ మరోపక్క టెర్రరిజం మీద షాకింగ్ గా అనిపించే ఎన్నో వివాదాస్పద అంశాలు ఇందులో ఉన్నాయనే పబ్లిసిటీ భారీ ఓపెనింగ్స్ కి దారి తీసింది. ఆంధ్ర బోర్డర్ లో ఉన్న తమిళ ఫాన్స్ తెలుగు వెర్షన్ చూడటం కోసం దగ్గరలో ఉన్న ఇక్కడి ఊళ్లకు రావడం జరిగింది. సినిమా క్లాసిక్ అని కాదు కానీ టేకింగ్ పరంగా మెప్పించడంతో ప్రేక్షకులు పాస్ మార్కులు వేశారు. కానీ ఇదంతా గతం. ఇప్పుడు అంత సీన్ కనిపించడం లేదు. అప్పట్లో చేసిన సందడిలో సగం కూడా ఇప్పుడు కనిపించడం లేదు. ఇప్పుడు ఈ ఫ్రాంచైజీని జనం మర్చిపోయిన నేపధ్యంతో పాటు శ్రీనివాస కళ్యాణం లాంటి సినిమాల పోటీని ఫేస్ చేయాల్సి ఉంది. కమల్ ఇప్పుడున్న అతి తక్కువ టైంలో మాటకు కట్టుబడి విడుదల చేస్తాడా లేక అలోచించి వాయిదా వేస్తాడా ఓ రెండు మూడు రోజుల్లో తేలిపోతుంది. తెలుగు వెర్షన్ బిజినెస్ అసలు జరగనేలేదని ఇన్ సైడ్ టాక్.