Begin typing your search above and press return to search.
కమల్ పెద్ద కాంప్లిమెంటే ఇచ్చాడు
By: Tupaki Desk | 3 May 2016 9:30 AM GMTతాను చేయలేనిది విశాల్ చేశాడని.. అతనో రియల్ హీరో అని అంటున్నాడు లోకనాయకుడు కమల్ హాసన్. విశాల్ ఓ ధైర్యమున్న సైనికుడని కూడా కమల్ కితాబివ్వడం విశేషం. ఇంతకీ కమల్ చేయలేనిది.. విశాల్ చేసింది ఏంటంటే.. నడిగర్ సంఘం కోసం సొంతంగా ఓ బిల్డింగ్ కట్టించడం.. ఇంకా సంఘంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకురావడం. నడిగర్ సంఘంలో కొన్నేళ్లుగా సాగుతున్న ఏకఛత్రాధిపత్యం.. అక్రమాలపై విశాల్ గళమెత్తడం.. నాజర్-కార్తిలతో కలిసి గత ఏడాది శరత్ కుమార్ వర్గం మీద ఎన్నికల్లో పోటీ పడి గెలవడం.. ఆ తర్వాత ఎన్నో మంచి కార్యక్రమాలు చేయడం తెలిసిన సంగతే. ఈ వర్గానికి కమల్ హాసన్ తన మద్దతు ప్రకటించి అండగా నిలిచాడు.
ఇటీవలే నడిగర్ సంఘం తరఫున క్రికెట్ మ్యాచ్ నిర్వహించి రూ.9 కోట్ల ఆదాయం రాబట్టిన నేపథ్యంలో తాజాగా ఓ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కమల్ మాట్లాడుతూ.. ‘‘సీనియర్లుగా నాతో పాటు ఎంతో మంది నడిగర్ సంఘంలో సమస్యల గురించి మాట్లాడాం. కానీ మేమందరం మాటల వరకే పరిమితమయ్యాం. ఎందుకంటే మా చొక్కాలకు మరకలు అంటుతాయేమో అని భయపడ్డాం. కానీ తమ చొక్కాలు చిరుగుతాయని తెలిసి కూడా విశాల్ అండ్ కో రంగంలోకి దూకింది. విజయవంతమైంది. సంఘాన్ని రక్షించింది. నేను చేయలేనిది విశాల్ చేశాడు. అతనో ధైర్యవంతుడైన సైనికుడు’’ అని గొప్ప కాంప్లిమెంట్ ఇచ్చాడు కమల్.