Begin typing your search above and press return to search.
మతం మార్చుకున్నా కూడా ఇష్టమే
By: Tupaki Desk | 28 July 2017 2:26 PM GMTఇప్పుడు ఒక హీరోయిన్ నేను మతం మారాను అని చెప్పడంతో అది పెద్ద డిస్కషన్ అవ్వలేదు కాని.. ఆమె ఒక లెజండరీ హీరో కూతురు కాబట్టి.. ఆయన ఎలా రియాక్ట్ అవుతాడోనని అందరూ చూశారు. ఇప్పుడు ఆయన దిమ్మతిరిగే క్లారిటీ ఇచ్చాడు.
ఆ మధ్యన హిందువైన కంపోజర్ ఇళయరాజా కొడుకు యువాన్ శంకర్ రాజా ముస్లింగా మారిపోయాడు. అలాగే కొంతమంది తనుశ్రీ దత్తా వంటి హీరోయిన్లు కూడా బౌద్దమతంలోకి కన్వర్ట్ అయ్యారు. స్వతాహాగా ముస్లిం అయిన ఖుష్బూ.. పెళ్ళి తరువాత పూర్తిస్థాయి హిందువుగా తన అవతారం కూడా మార్చుకుని రోజూ నుదుట కుంకుమ పెట్టుకుని కనిపిస్తుంది. వీళ్ళందరూ ఇలా మతం మారినప్పుడు కాస్త రభస జరిగిన మాట వాస్తవమే. కుటుంబ సభ్యులే కలత చెందారు. తరువాత సర్ధుమణిగినా కూడా.. ముందులో దుమారమే రేగింది. అందుకే అప్పుడు అక్షరా హాసన్ విషయంలో విశ్వనటుడు కమల్ హాసన్ ఎలా రియాక్ట్ అవుతాడని చూస్తున్నారు.
అయితే కమల్ హాసన్ మాత్రం ఇదంతా చాలా సింపుల్ గా తీసుకున్నాడు. 'హే అక్షు. మతం మార్చుకున్నావా? నువ్వు మతం మార్చుకున్నా నాకు నువ్వంటే ఇష్టమే. మతం కాదు.. ప్రేమ నిస్వార్ధమైనది. జీవితాన్ని ఎంజాయ్ చెయ్. నీ బాపు(నాన్న)’ అంటూ ట్వీట్ చేశారు కమల్. అంటే ఓపెన్ గా తన ఒపీనియన్ ఏంటనేది ప్రపంచానికి కూడా చెప్పేస్తున్నారాయన. అంతకంటే ఎవరికైనా ఇంకేం తెలుసుకోవాలని ఉంటుంది? అయినా కూడా కమల్ చెప్పినట్లు మతం కాదు శాశ్వతం.. ప్రేమే కదా? కాబ్టటి నో వర్రీస్!!