Begin typing your search above and press return to search.

ప్యారిస్‌ ట్రాజడీపై మన హీరో సలహా

By:  Tupaki Desk   |   18 Nov 2015 5:19 AM GMT
ప్యారిస్‌ ట్రాజడీపై మన హీరో సలహా
X
మొన్న‌టికి మొన్న ప్యారిస్ న‌గ‌రంపై ఉగ్ర‌దాడి ప్ర‌పంచాన్ని ఉలిక్కిప‌డేలా చేసింది. ఎట్నుంచి వ‌చ్చారో ఇస్లామిక్ తీవ్ర‌వాదులు ఏకంగా ప్యారిస్‌ లోని ఆరు చోట్ల మార‌ణాయుధాల‌తో చెల‌రేగిపోయారు. దాదాపు 130 మంది అమాయ‌కుల ప్రాణాలు తీశారు. ఎంద‌రినో గాయాల పాల్జేశారు. ప్ర‌పంచం విస్తుపోయేలా చేసిన ఘ‌ట‌న ఇది. ముంబై ఎటాక్స్ త‌ర‌హాలోనే ఈ దాడి కూడా అత్యంత భ‌యాన‌కంగా సాగింది. ఈ దాడి త‌ర్వాత ప్ర‌పంచ దేశాలు అలెర్టుగా లేకేపోతే.. దేశాధినేత‌ల వైఖ‌రి మార‌క‌పోతే ఇలాంటి మ‌రిన్ని ప్ర‌మాదాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు విశ్వ‌న‌టుడు క‌మ‌ల్‌ హాస‌న్‌.

పాశ్చాత్య దేశాల్లో ముఖ్యంగా యూరోపియ‌న్ కంట్రీస్‌ లో రాజ‌కీయ ప్రాబ‌ల్యం కోసం పొలిటీషియ‌న్లు రెండు నాలుక‌ల ధోర‌ణిని అనుస‌రిస్తున్నారు. యుద్ధంలో గెల‌వాలి అన్న ప‌ద్ధ‌తిలోనే వెళుతున్నారు త‌ప్ప.. నిజానిజాలు ఆలోచించ‌డం లేదు. ప్ర‌జ‌ల్ని ఎలా కాపాడాలి. అశాంతి లేకుండా ఎలా చేయాలి? అన్న‌ది ప‌ట్టించుకోవ‌డం లేదు. అందుకే ఇప్పుడు చెబుతున్నా. మీరు భార‌తీయుడైన మ‌హాత్మ గాంధీజీ ప్ర‌వ‌చించిన అహింసా సిద్ధాంతాన్ని న‌మ్ముకోండి. అక్క‌డ ఆచ‌రించండి. ఇలాంటివి జ‌ర‌గ‌వు. దాడుల నుంచి బైట‌ప‌డాలంటే ఇది ఆచ‌రించాల్సిన టైమ్ వ‌చ్చింది.. అంటూ క‌మ‌ల్ ఎంతో ఉద్వేగంగా మాట్లాడుతూ.. ఈ టెర్రర్‌ ట్రాజడీపై ఆ సలహాను ఇచ్చారు.

ఈ స్పీచ్ సారాంశం ఏమంటే అస‌లు ఉగ్ర‌దాడుల వెన‌క ఎన్నో బ‌లీయ‌మైన రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలు, స్వార్థ ప్ర‌యోజ‌నాలు దాగి ఉంటాయ‌న్న స‌త్యాన్ని ప్ర‌పంచం గుర్తెర‌గాల్సి ఉంటుంది. అంతేకాదు అహింసా సిద్ధాంతాన్ని ఆచ‌రిస్తేనే ప్ర‌జ‌ల‌కు మ‌నుగ‌డ ఉంటుంది భ‌విష్య‌త్‌లో అన్న‌ది క‌మ‌ల్ ఉద్ధేశం. మ‌రి ఇలాంటి మంచిని ఆచ‌రించే గొప్ప మ‌న‌సు వెస్ట్‌లో ప్ర‌భుత్వాల‌కు, జ‌నాల‌కు ఉందంటారా? ఇస్లామిక్ తీవ్ర‌వాదానికి వ్య‌తిరేకంగా అంతా క‌లిసిక‌ట్టుగా ఏక‌తాటిపైకి వ‌స్తారంటారా? పైవాడికే తెలియాలి.