Begin typing your search above and press return to search.

కాస్త ఇంగ్లీషులో ట్వీటేయమ్మా కమల్

By:  Tupaki Desk   |   30 Jan 2016 9:30 AM GMT
కాస్త ఇంగ్లీషులో ట్వీటేయమ్మా కమల్
X
విశ్వ నటుడు కమల్ హాసన్ రీసెంట్ గా జనవరి 26న సోషల్ మీడియాలోకి అడుగుపెట్టారు. అంతటి ప్రఖ్యాతి చెందిన నటుడి ట్వీట్స్ ఎలా ఉంటాయని దాదాపు ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూసింది. తన కూతురిని ఆప్యాయంగా దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకుంటున్న ఫోటోను, ఆకర్షించే ట్వీట్ తో ఆకట్టుకున్నారు కమల్.

ఈ మహానటుడి నుంచి బోలెడన్న అప్ డేట్స్ పొందచ్చని అందరూ చూస్తున్న సమయంలో షాక్ ఇచ్చారు కమల్ హాసన్. తాజాగా మరో ట్వీట్స్ చేశారు కానీ అవి చాలామందికి అర్ధం కాలేదు. కారణం.. అవి తమిళ్ భాషలో చేయడమే. పూర్తిగా తమిళం లాంగ్వేజ్ లోనే టైప్ చేసి రెండు ట్వీట్స్ పెట్టడంతో.. అవేంటో అర్ధం కాక చాలామంది కన్ ఫ్యూజ్ అయ్యారు. అఫ్ కోర్స్.. అవి వెట్రిమారన్ తీసిన విశారణై సినిమాకి సంబంధించినవి. ఆ మూవీ ఎంత అద్భుతంగా ఉందో, తనకు ఎందుకు అంతగా నచ్చిందో ట్వీట్స్ ద్వారా చెప్పారు కమల్ హాసన్. కానీ ఇవి కేవలం తమిళ ప్రజలకు మాత్రమే అర్ధమయ్యాయి. కమల్ కు ప్రపంచం అంతా ఫ్యాన్స్ ఉన్నారు.

తమిళ్ తో సమానంగా తెలుగు జనాలు కూడా అభిమానించినా.. ఆయన విశ్వ నటుడే. అందుకే మరీ ఇలా తమిళ్ భాషలో కాకుండా.. అందరికీ అర్ధం అయ్యేలా ఇంగ్లీష్ ట్వీట్ చేయాలని అందరూ కోరుకుంటున్నారు. మరి ఈసారి నుంచైనా.. కమల్ హాసన్ అభిమానుల కోరికను తీరుస్తారని ఆశిద్దాం. ఆయన ఇచ్చే అప్డేట్స్ అందరికీ అర్ధమయ్యేలా ఉండాలని కోరుకుందాం.