Begin typing your search above and press return to search.

కమల్ కి ఫ్రాన్స్ ప్రెస్టీజియస్ అవార్డ్

By:  Tupaki Desk   |   22 Aug 2016 4:14 AM GMT
కమల్ కి ఫ్రాన్స్ ప్రెస్టీజియస్ అవార్డ్
X
కమల్ హాసన్ అంటే ఇండియన్ సినిమాకే కాదు.. ప్రపంచవ్యాప్తంగా పరిచయం అక్కర్లేని పేరు. చిన్న వయసులోనే సినిమా కెరీర్ ప్రారంభించిన కమల్ కు సినిమానే ప్రాణం.. అదే జీవితం. అందుక 56 ఏళ్లుగా సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఆయనకు దక్కని అవార్డులు చాలా అరుదుగా ఉంటాయి. అసలు కమల్ కి ఓ అవార్డ్ ఇవ్వడం అంటే.. ఆ పురస్కారానికే గౌరవం దక్కినట్లుగా భావించేవాళ్లు చాలామందే ఉంటారు.

కమల్ హాసన్ కి ప్రతిష్టాత్మక అవార్డ్ Chevalier de l’Orde Des Arts et Letters ను ఇచ్చేందుకు ఫ్రెంచ్ ప్రభుత్వం నిర్ణయించింది. సినిమా రంగానికి చేసిన సేవలకు గాను ఫ్రాన్స్ ఇచ్చే అత్యుత్తమ పురస్కారం ఇదే. కమల్ హాసన్ ఫిలిం ఇండస్ట్రీలో సాధించిన విజయాలకు గాను ఈ అవార్డును అందించనుంది ఫ్రాన్స్. త్వరలో పారిస్ లో ఓ ప్రత్యేకంగా ఓ కార్యక్రమం ఏర్పాటు చేసి.. అందులో ఈ అవార్డును అందించనున్నారు అక్కడి ప్రభుత్వ పెద్దలు.

ఇప్పటికే ఈ Chevalier de l’Orde Des Arts et Letters అవార్డును ఇండియా తరఫున శివాజీ గణేశన్.. అమితాబ్ బచ్చన్.. షారూక్ ఖాన్.. ఐశ్వర్యారాయ్.. నందితా రాజ్ లు అందుకున్నారు. ప్రస్తుతం కాలు విరగడంతో బెడ్ రెస్ట్ తీసుకుంటున్న కమల్ హాసన్.. సెప్టెంబర్ చివర్లో శభాష్ నాయడు షూటింగ్ ని తిరిగి ప్రారంభించే అవకాశం ఉంది.