Begin typing your search above and press return to search.
బిగ్ బాస్ 2 వచ్చేస్తున్నాడు
By: Tupaki Desk | 8 May 2018 11:36 AM GMTఅరె జూనియర్ ఎన్టీఆర్ చేయలేను అన్నాడు ఇంకా నాని కన్ఫర్మ్ కాలేదు అప్పుడే ఈ ప్రకటన ఏంటి అనుకోకండి. ఈ బిగ్ బాస్ తెలుగు వాళ్ళ కోసం కాదు. తమిళ ప్రేక్షకుల కోసం. అవును. ఫస్ట్ సీజన్ ను హోస్ట్ చేసిన కమల్ హాసనే రెండో సిరీస్ కు కూడా యాంకర్ గా చేసేందుకు సుముఖత వ్యక్తం చేయటంతో ఆ మేరకు షూటింగ్ కూడా మొదలుపెట్టారని తెలిసింది. దీనికి సంబంధించిన ప్రోమోని జూన్ 3 నుంచి ఛానల్ తో పాటు ఆన్ లైన్ లో విడుదల చేయనున్నారు.అసలు షో మాత్రం జూన్ 25 నుంచి ప్రారంభం అవుతుందని తెలిసింది. నిజానికి కమల్ ఈ షో చేయడు అనే అనుకున్నారు అంతా. కారణం తన రెండు సినిమాలు విశ్వరూపం 2-శభాష్ నాయుడు విడుదల కార్యక్రమాలతో పాటు తాను ఇటీవలే ప్రారంభించిన రాజకీయ పార్టీ వ్యవహారాలు చూసుకోవాలి కాబట్టి. అలాంటప్పుడు బిగ్ బాస్ షో చేయడనే అనుకున్నారు అందరు. సూర్య చేసే అవకాశాలు ఉన్నాయంటూ కొంత కాలం మీడియాలో వార్త నడిచింది కూడా.
సో తమిళ్ బిగ్ బాస్ కి రూట్ పూర్తిగా క్లియర్ అయినట్టే. ఒవియా లాంటి తారల వల్ల అక్కడ ఫస్ట్ సీజన్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తన పేరు మీద అభిమాన సంఘాలు వెలిసే రేంజ్ లో తను చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. మరి ఇప్పుడు ఎవరిని పార్టిసిపెంట్స్ గా తీసుకురాబోతున్నారో అన్నది సస్పెన్స్ గా మారింది. అక్కడ ఓకే కాని తెలుగు లో మాత్రం హోస్ట్ విషయం ఎటూ తేలడం లేదు. తారక్ చేసే ఛాన్స్ లేదని తేలిపోయింది కాబట్టి ఇంకెవరు టేకప్ చేస్తారు అనే దాని గురించి చిన్న క్లూ కూడా లేదు. నానిని అడిగితే కొట్టిపారేయడం లేదు అలాగని ఒప్పుకోవడమూ లేదు. సో ఇక్కడ మాత్రం లేట్ అవుతుంది అనేదాంట్లో డౌట్ అక్కర్లేదు. తమిళ్ లో ఇది చేయగానే కమల్ ఇకపై దీనికి స్వస్తి చెప్పేసి పూర్తి స్థాయి పాలిటిక్స్ లో బిజీ అవుతాను అని చెబుతున్నాడట. మనకూ రియాలిటీ షోలకు డబ్బింగ్ వస్తే బాగుండు.తెలుగులో స్టార్ట్ అయ్యే దాకా కమల్ చేసే షోని చూసుకుంటూ ఎంజాయ్ చేయొచ్చు.