Begin typing your search above and press return to search.
హైస్కూల్ చదువుతో హార్వర్డ్ లో లెక్చర్
By: Tupaki Desk | 7 Feb 2016 6:26 AM GMTవిశ్వ నటుడు కమల్ హాసన్ ఓ విశిష్ట గౌరవాన్ని అందుకోనున్నారు. భారతీయ కాలమానం ప్రకారం ఇవాళ అంటే ఫిబ్రవరి7న అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీలో లెక్చర్ ఇవ్వనున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి ఈ లెక్చర్ ప్రారంభం కానుంది. కొంత టైం డిలేతో.. ఈ కార్యక్రమాన్ని ఇండియాలో టెలికాస్ట్ చేయనున్నారు. సీఎన్ ఎన్ ఐబీఎన్ ఛానల్ కమల్ హాసన్ హార్వర్డ్ లెక్చర్ ని ప్రసారం చేయనుంది.
మన దేశానికి చెందిన ఒక ప్రముఖ నటుడు హార్వర్డ్ యూనివర్సిటీలో లెక్చర్ ఇవ్వడం సాధారణమేమీ కాదు. అందులోనూ కమల్ హాసన్ లాంటి మహా నటుడితో క్లాస్ అంటే.. సహజమే అనుకోవచ్చు. కానీ హార్వర్డ్ అంటే.. అత్యున్నత చదువులకు అసలైన వేదిక. ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి చెందిన ఈ యూనివర్సిటీలో పాదం మోపేందుకు ప్రతిభ గల విద్యార్ధులు తహతహలాడుతుంటారు. అలాంటి యూనివర్సిటీలో లెక్చర్ ఇచ్చేందుకు కమల్ హాసన్ వెళ్లారు.
మరి అంత పెద్ద యూనివర్సిటీలో క్లాస్ ఇచ్చే కమల్ చదివినది ఎంతో తెలుసా? ఆయన హైస్కూల్ కూడా కంప్లీట్ చేయలేదంటే నమ్మడం కష్టమే కానీ.. అదే నిజం. ఎలిమెంటరీ స్కూల్ వరకే పూర్తి చేసిన కమల్.. హైస్కూల్ లో చేరినప్పటి నుంచి సినిమాల వైపు మొగ్గు చూపారు. ఆ తర్వాత రెండు మూడేళ్లకే సినిమాల్లోకి వెళ్లిపోయారు. అలా హైస్కూల్ కూడా పూర్తి చేయని ఓ విద్యార్ధి.. ఇప్పుడు హార్వర్డ్ యూనివర్సిటీలో లెక్చర్ ఇవ్వనున్నారన్న మాట.