Begin typing your search above and press return to search.

కమల్ హాసన్ కాలికి శస్త్ర చికిత్స‌.. 5 రోజులు డాక్ట‌ర్ల స‌మ‌క్షంలో!

By:  Tupaki Desk   |   19 Jan 2021 3:52 PM GMT
కమల్ హాసన్ కాలికి శస్త్ర చికిత్స‌.. 5 రోజులు డాక్ట‌ర్ల స‌మ‌క్షంలో!
X
విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ ఆల్ రౌండ్ ప్ర‌తిభ గురించి చెప్పాల్సిన ప‌నేలేదు. రాజ‌కీయాలు ఒక‌వైపు.. సినిమాలు మ‌రోవైపు .. అన్నిటినీ స‌వ్య‌సాచిలా న‌డిపించేస్తున్నారు. అయితే ఇంత‌లోనే ఇన్ని షెడ్యూళ్ల న‌డుమ ఆయ‌న ఆస్ప‌త్రిలో చేరార‌ని తెలుస్తోంది.

కమల్ హాసన్ ఆస్ప‌త్రిలో చేర‌డానికి కార‌ణం.. అత‌డి కాలికి శ‌స్త్ర‌చికిత్స చేయనుండ‌డ‌మే. తాజా స‌మాచారం ప్ర‌కారం.. కమల్ హాసన్ లెగ్ సర్జరీ విజ‌య‌వంతంగా పూర్త‌యింది. నాలుగైదు రోజుల పాటు డాక్టర్ పరిశీలనలో ఉంటారని.. అనంత‌రం ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అవుతారని తెలిసింది.

కమల్ హాసన్ ఇటీవ‌ల‌ ప్రకటించిన కొత్త చిత్రం `విక్రమ్` షూటింగ్ కిక్-స్టార్ట్ చేయాల్సి ఉండ‌గా శ‌స్త్ర చికిత్స జ‌రిగింది. చిన్న‌పాటి గ్యాప్ తీసుకుని వెంట‌నే ప్రారంభిస్తార‌ని తెలుస్తోంది. లోకేష్ కనగరాజ్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. కమల్ హాసన్ రాజకీయ పార్టీ `మక్కల్ నీది మయం` మేలో జరగనున్న తమిళనాడు సార్వత్రిక ఎన్నికల్లో పోటీకి దిగ‌నుంది.