Begin typing your search above and press return to search.
ఆంధ్రుల మనసు కొల్లగొట్టిన కమల్
By: Tupaki Desk | 23 Oct 2015 11:39 AM GMTకమల్ హాసన్ తన పెద్ద మనసు చాటుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి ప్రత్యేకంగా నిలిచిన సందర్భాన్ని గుర్తుంచుకుని తన స్పెషల్ విషెస్ చెప్పాడు. నిన్న దసరా సందర్భంగా ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానికి శంకుస్థాపన జరిగిన సందర్భాన్ని పురస్కరించుకుని కమల్ తన శుభాకాంక్షలు చెప్పాడు. ఈ సందర్భంగా ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
తెలుగు మాట్లాడే ప్రజలు అదృష్టవంతులని.. వారికి రెండు రాజధానులు ఉన్నాయని కమల్ అన్నాడు. ఒకే భాష మాట్లాడే వారికి రెండు రాష్ట్రాలు, రెండు అరుదైన రాజధానులు ఉండటం అరుదైన విషయమని.. ఇది తెలుగు ప్రజల అదృష్టమని కమల్ అన్నారు. ఆంధ్రుల కొత్త రాజధాని అమరావతి అందమైన నగరంగా రూపుదిద్దుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత సహా అక్కడి సెలబ్రెటీలందరూ అమరావతి శంకు స్థాపన సందర్భంలో ఒక్క మాటా మాట్లాడని సందర్భంలో కమల్ ఇలా స్పందించడం గొప్ప విషయమే. ఇది తన సినిమాల ప్రయోజనం కోసమే అని నెగెటివ్ గా మాట్లాడేవాళ్లు ఉండొచ్చు కానీ.. ఈ మాత్రం కూడా ఎవ్వరూ చేయని సంగతి గుర్తుంచుకోవాలి. తెలుగువారి కోసం తెలుగు సినిమాలో నటిస్తా అని చెప్పి.. చీకటి రాజ్యం సినిమాను తెలుగులోనూ తీసి కొంత వరకు ఆ హామీని నెరవేర్చిన కమల్.. ఓ శుభ సందర్భాన్ని గుర్తుంచుకుని శుభాకాంక్షలు చెప్పడం మంచి విషయమే.