Begin typing your search above and press return to search.

తండ్రి పక్కనే బాయ్ ఫ్రెండ్ తో..

By:  Tupaki Desk   |   6 Dec 2017 5:36 PM GMT
తండ్రి పక్కనే బాయ్ ఫ్రెండ్ తో..
X

హీరోల పిల్లలు ఏ చిన్న సీక్రెట్ కార్యం తలపెట్టినా ఆ మ్యాటర్ ఒక్కసారిగా వైరల్ అవ్వడం చాలా కామన్. ఇక వారు స్టార్స్ అయితే ఏమైనా ఉందా పక్కన వారి తండ్రి - తల్లి పేరు కూడా జోడించి మరి ఆమె ఇలా చేస్తోందట.. అలా తిరుగుతుందట.. అని ఎవరికి వారు ఇష్టం వచ్చినట్లుగా కామెంట్స్ చేస్తారు. అయితే ప్రస్తుతం సెక్సిణి శృతి హాసన్ పేరు కూడా చాలా గట్టిగా వినిపిస్తోంది. లెజండరీ యాక్టర్ కమల్ హాసన్ కూతురు కావడంతో కొన్ని మీడియాలలో ప్రత్యేక కథనాలు వెలువడుతున్నాయి.

గత కొంత కాలంగా శృతి హాసన్ లండన్‌కు చెందిన మైఖేల్ కోర్సేల్‌ అనే యువకుడితో ప్రేమాయణం కొనసాగిస్తోందంటూ వార్తలు ఏ రేంజ్ లో వస్తున్నాయో అందరికి తెలిసిందే. పెళ్లి చేసుకోబోతోందని అంతకుముందు లైట్ గా రూమర్స్ వచ్చాయి.. కానీ ఎప్పుడైతే శృతి తన తల్లికి మైకేల్ ని పరిచయం చేసిందో అప్పటినుంచి అందరు త్వరలో శృతి పెళ్లి కాబోతోందని చర్చించుకున్నారు. ఆఖరికి కమల్ హాసన్ కూడా ఒకే చేశారని టాక్ వచ్చింది. కానీ శృతి మాత్రం తన పర్సనల్ విషయాలను చెప్పడానికి ఇష్టం లేదని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలిపింది.

అయితే రీసెంట్ గా అమ్మడు మళ్లీ తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి దర్శనం ఇచ్చింది. అంతే కాకుండా పక్కన కమల్ హాసన్ కూడా ఉన్నారు. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యాయి. మంగళవారం చెన్నైలో తమిళ నటుడు ఆదవ-వినోదినిల వివాహం గ్రాండ్ గా జరిగింది. కోలీవుడ్ స్టార్స్ చాలా మంది వచ్చారు. ఇక శృతి సంప్రదాయ పద్దతిలో రెడ్ కలర్ పట్టు చీరలో రాగా.. మైకేల్ కూడా పంచె కట్టుతో వచ్చాడు. వారిద్దరూ కమల్ దగ్గర కూర్చొని ఉండడం అక్కడ అందరిని ఆకట్టుకుంది. మొత్తానికి డాడీ నుంచి శృతికి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు ఉందని కొందరు కామెంట్స్ చేటున్నారు.