Begin typing your search above and press return to search.

ఆన్ సెట్స్ లో భార‌తీయుడు ప‌స్తు!

By:  Tupaki Desk   |   16 Dec 2022 7:34 AM GMT
ఆన్ సెట్స్ లో భార‌తీయుడు ప‌స్తు!
X
విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ ఆన్ సెట్స్ లో ప‌స్తుంటున్నాడా? క‌నీసం మంచి నీళ్లు కూడా ముట్ట‌డం లేదా? అంటే అవున‌నే తెలుస్తోంది. ప్ర‌స్తుతం శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో క‌మ‌ల్ భారతీయుడు -2 షూటింగ్ శ‌ర వేగంగా జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఆల‌స్య‌మైన నేప‌థ్యంలో వీలైనంత త్వ‌ర‌గా షూట్ పూర్తిచేసి పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కి వెళ్లిపోవాల‌ని శంక‌ర్ ఓ ప్ర‌ణాళిక‌తో ముందుకెళ్తున్నారు.

మ‌రి ఈ సినిమా కోసం క‌మ‌ల్ ఇంకెంత‌గా శ్ర‌మిస్తున్నారో? తెలిసింది మాత్రం చాలా త‌క్కువ మందికే. ఇందులో క‌మ‌ల్ 90 ఏళ్ల వృద్దిడి పాత్ర పోషిస్తున్నారు. ఆ పాత్ర కోసం క‌మ‌ల్ ప్రోస్తెటిక్ మ్యాక‌ప్ వేసుకుంటున్నారు. ఉద‌యం సెట్ కి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి సాయంత్రం వ‌ర‌కూ అదే మ్యాక‌ప్ తో షూట్ లో పాల్గొంటున్నారు. 90 ఏళ్ల వృద్ధ పాత్ర కావడంతో ప్రోస్తెటిక్ త‌ప్ప‌డం లేదు.

అయితే ఈ పాత్ర కోసం క‌మ‌ల్ ఎలాంటి ఆహారం తీసుకోకుండా ప‌స్తుతోనే షూట్లో పాల్గొంటున్నారుట‌. ఆహారం తీసుకుంటే శ‌రీరంలో వ‌చ్చే మార్పుల‌తో ప్రొస్తెటిక్ కి అవ‌త‌రాలు ఎదుర‌వుతున్నాయ‌ట‌.

దీంతో మంచి నీళ్లు కూడా చాలా త‌క్కువ‌గానే తీసుకుంటున్నారుట‌. ఈ నేప‌థ్యంలో ఉదయం సెట్ కి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి సాయంత్రం వ‌ర‌కూ ఎలాంటి ఆహారం లేకుండానే షూట్ ముగిస్తున్నారుట‌.

ఇంటికెళ్లిన త‌ర్వాత కూడా త‌క్కువ మొతాదులోనే తీసుకుంటున్నారుట‌. ఎక్కువ‌గా లిక్విడ్ రూపంలో ఉండే వాటినే తీసుకుంటున్న‌ట్లు స‌మాచారం. అయితే ఇలా డైట్ విష‌యంలో క‌ఠినంగా వ్య‌వ‌రించ‌డమే క‌మ‌ల్ ని ఇటీవ‌లి హాస్పిట‌లైజ్డ్ అవ్వ‌డాప‌నికి ఓ కార‌ణంగా వినిపిస్తుంది. బాగా నీర‌సించ‌డంతోనే ఆయ‌నకు డాక్ట‌ర్లు విశ్రాంతి సూచించిన‌ట్లు తెలుస్తోంది.

'దశావ‌తారం'లో క‌మ‌ల్ 10 ర‌కాల పాత్ర‌లతో పొల్చితే భార‌తీయుడు ప్రోస్తెటిక్ మ్యాక‌ప్ పెద్ద విష‌య‌మేమి కాదు. మ్యాక‌ప్ లు వేయించుకోవ‌డంలో మ‌హా దిట్ట‌. ఇంత‌వ‌ర‌కూ ఏ భార‌తీయ న‌టుడు ఆయ‌న పోషించిన‌న్ని పాత్ర‌లుగానీ..మ్యాక‌ప్ లు గానీ వేసుకోలేదు. ఇది క‌మ‌ల్ కి మాత్ర‌మే చెల్లింది. కాక‌పోతే వ‌యోభారం కూడా కొంత వర‌కూ ప్ర‌భావం చూపుతుంది. ఆ ర‌కంగానే క‌మ‌ల్ ఇబ్బంది ప‌డుతున్న‌ట్లు తెలుస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.