Begin typing your search above and press return to search.

ఆ ఇద్దరి కలయిక ..తమిళ ప్రజల కోరిక: సుహాసిని

By:  Tupaki Desk   |   20 Nov 2019 7:10 AM GMT
ఆ ఇద్దరి కలయిక ..తమిళ ప్రజల కోరిక: సుహాసిని
X
తమిళనాడు మాజీ సీఎం జయలలిత చనిపోయిన తరువాత తమిళ రాజకీయం ఒక్కసారిగా అతలాకుతలం అయిపోయింది. సరైన నాయకుడు లేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతం ఉన్న రాజకీయ నేతలు తమ పదవులు కాపాడుకోవడానికే ఎక్కువ సమయం వెచ్చిస్తున్నారు. దీనితో తమిళ ప్రజలు సరైన పాలన అందించే నాయకుడి కోసం వెదురుచూస్తున్నారు. ప్రస్తుత తమిళ రాజకీయాలని బట్టి చూస్తే అతి త్వరలో ..కమల్ హాసన్ , రజినీకాంత్ తమిళనాట రాజకీయంగా కీలకం కాబోతున్నారు అని చెప్పవచ్చు.

కమలహాసన్‌ ఇప్పటికే పార్టీని ప్రారంభించి రాజకీయాల్లో ఉన్నారు. ఇక రజనీకాంత్‌ త్వరలో రాజకీయ రంగప్రవేశానికి సిద్ధం అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ సినీ రంగంలో మంచి మిత్రులన్న విషయం అందరికి తెలిసిందే. అయితే రాజకీయాల్లోనూ కలసి పనిచేస్తే మంచి ఫలితం ఉంటుందన్న అభిప్రాయం చాలా మందిలో కలుగుతోంది. వీరిద్దరూ కలవాలని ఇటీవల సీనియర్‌ దర్శకుడు, నటుడు విజయ్‌ తండ్రి ఎస్‌ ఏ.చంద్రశేఖర్‌ అలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు. కాగా ఇదే అంశంపై కమలహాసన్‌ అన్నయ్య కూతురు, నటీ సుహాసినిని ఇటీవల ఒక టీవీ ఛానల్‌ ప్రశ్నించింది. ఆ భేటీలో రజనీ, కమల్‌ కలవాలన్న దర్శకుడు ఎస్‌ ఏ.చంద్రశేఖర్‌ కోరిక గురించి నటి సుహాసిని వద్ద ప్రస్తావించారు.

దానికి ఆమె మాట్లాడుతూ .. రజనీకాంత్, కమలహాసన్‌ కలవాలన్నదే తమందరి కోరిక, ఆశ అని తెలిపింది. వారిద్దరూ కలిస్తే తమిళనాడుకే మంచిదని అన్నారు. కమల్, రజనీ కుంటుంబాలు ఒకే నేపథ్యానికికు చెందిన వారన్నది తెలిసిందేనన్నారు. కమలహాసన్‌కు చెందిన కార్యక్రమాల కంటే రజనీకాంత్‌ కుటుంబానికి చెందిన కార్యక్రమాల్లోనే ఎక్కువగా పాల్గొన్నామని, ఏదేమైనా కమల్, రజనీ రాజకీయపరంగా కలిస్తే అంతకంటే మంచి విషయం ఏముంటుందీ అన్నారు.అయితే ఇక్కడ ఎవరి సిద్ధాంతాలు వారికుంటాయన్నారు. అలా వారు వారి సిద్ధాంతాలకనుగుణంగా ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తాము స్వాగతిస్తామని సుహాసిని తెలిపారు.

సినీరంగంలో రెండు ధ్రువాలుగా ఉన్న కమల్, రజనీ రాజకీయాల్లో ఒకటవడం సాధ్యమా అన్న ప్రశ్నకు బాలీవుడ్‌ లో షారూఖ్‌ ఖాన్, అమీర్‌ ఖాన్‌ కలిసి నటించలేదని, అలాగని వారిద్దరు రెండు ధ్రువాలు అని చెప్పగలమా అని చెప్పారు. సింపుల్‌ లాజిక్‌ ఏమిటంటే రెండు బలాలు ఒకే చోట ఉంచే కంటే పక్క పక్కన ఉంటే మరింత బలం చేకూరుతుంది అని అన్నారు. ఆ ఇద్దరు కలవాలని తమిళ ప్రజల కోరిక అని తెలిపింది. తాజాగా రజిని తో కలిసి పనిచేయడానికి నేను సిద్ధం అని కమల్ ప్రకటించగా ...దానిపై రజిని స్పందిస్తూ.. ఇద్దరి లక్ష్యం ఒక్కటైనప్పుడు, ఒకే దారిలో నడవడానికి నాకేం ఇబ్బందిలేదు. అలాగే నాకు కమల్ మంచి మిత్రుడు, కలిసి నడవడానికి సిద్ధం అంటూ ప్రకటించారు.