Begin typing your search above and press return to search.

ఖద్దర్ వ్యాపారంలో 'భారతీయుడు'

By:  Tupaki Desk   |   16 Nov 2021 9:18 AM GMT
ఖద్దర్ వ్యాపారంలో భారతీయుడు
X
చేనేతకు చేయూత నిచ్చేందుకు గాను యూనివర్శిల్ స్టార్‌ కమల్‌ హాసన్‌ వస్త్ర వ్యాపారంలో అడుగు పెట్టాడు. భారత చేనేత ఉత్పత్తులను పాశ్చత్య దేశాలకు అందించే ఉద్దేశ్యంతో కమల్‌ హాస్‌ కేహెచ్‌ హౌస్ ఆఫ్‌ ఖద్దర్ ను మొదలు పెట్టాడు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. తన బ్రాండ్‌ ను పరిచయం చేయడం కోసం ఒక చిన్న ప్రోమోను కూడా కమల్‌ హాసన్‌ వదిలాడు. చేనేత కార్శికులు నేచే వస్త్రాలను మాత్రమే తన కలెక్షన్స్ లో కమల్‌ హాసన్ ఉంచుతాడని అంటున్నారు. ఖద్దర్ ను ప్రపంచానికి పరిచయం చేయడం కోసం కమల్‌ హాసన్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని దేశ వ్యాప్తంగా ఉన్న చేనేతన్నలు హర్షిస్తున్నారు.

గత ఎన్నికల సమయంలో కమల్‌ హాసన్ కాంచీ పురం చేనేత కార్మికులను ఆదుకుంటాను అంటూ హామీ ఇచ్చాడు. అందుకే వారి కలెక్షన్స్ ను ప్రపంచం ముందుకు తీసుకు వెళ్లే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా చెబుతున్నారు. కమల్‌ హాసన్ ఇలాంటి ఒక ఫ్యాక్షన్‌ రంగంలోకి అడుగు పెట్టడం ఇదే ప్రథమం అవ్వడం విశేషం. ఆయన ఈ వస్త్ర వ్యాపారంను లాభాల కోసం కాకుండా చేనేత కార్మికుల కోసం నిజంగా నిర్వహిస్తే మాత్రం ఖచ్చితంగా దేశ వ్యాప్తంగా ఉన్న చేనేత కార్మికులకు మంచి జరుగుతుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

చేనేత వస్త్రాలు అంటే ముతక వస్త్రాలు అనే ఒక అభిప్రాయంను కమల్‌ హాసన్‌ తొలగించి ట్రెండీ వరల్డ్‌ లో ఎన్నో చేనేత వస్త్రాలు ఉన్నాయని.. ఖద్దర్ లో ఎన్నో అద్బుతమైన మోడల్స్ ఉంటాయనే విషయాన్ని ఆయన జనాల్లోకి తీసుకు వెళ్లాలని నేతన్నలు కోరుకుంటున్నారు. కమల్‌ హాసన్‌ ఈ వ్యాపారంలో అడుగు పెట్టడంలో కీలక భూమిక పోషించిన వ్యక్తి అమృత. కాస్ట్యూమ్‌ డిజైనర్ అయిన అమృత వల్లే కమల్‌ హాసన్‌ కు ఖద్దర్ పై ఆసక్తి పెరిగినట్లుగా చెబుతూ ఉంటారు. అనంతపురం జిల్లాకు చెందిన ఖద్దర్ అంటూ కమల్‌ కు చాలా ఇస్టంగా చెబుతూ ఉంటారు. అందుకే చేనేత కార్మికుల కోసం వెన్ను దన్నుగా ఉండే ఉద్దేశ్యంతో ఖద్దర్ వ్యాపారంలో అడుగు పెట్టడాని అంటున్నారు. మరో వైపు కమల్‌ విక్రమ్‌ సినిమా రూపొందుతోంది. వచ్చే ఏడాది సమ్మర్ నుండి ఇండియన్‌ 2 సినిమా పునః ప్రారంభం అవ్వబోతున్నట్లుగా చెబుతున్నారు.