Begin typing your search above and press return to search.

నిన్న రోలెక్స్‌..ఈ సారి స‌ర్దార్‌ని లైన్ లో పెట్టేస్తున్నాడా?

By:  Tupaki Desk   |   25 Oct 2022 6:11 AM GMT
నిన్న రోలెక్స్‌..ఈ సారి స‌ర్దార్‌ని లైన్ లో పెట్టేస్తున్నాడా?
X
యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్ దాదాపు నాలుగేళ్ల విరామం త‌రువాత న‌టించిన యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ `విక్ర‌మ్‌` మూవీలో సంచ‌ల‌న విజ‌యాన్ని సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే. లోకేష్ క‌న‌గ‌రాజ్ అత్యంత భారీ స్థాయిలో తెర‌కెక్కించిన ఈమూవీని హీరో క‌మ‌ల్ హాస‌న్ న‌టించి స్వీయ నిర్మాణంలో రాజ్ క‌మ‌ల్ ఇంట‌ర్నేష‌న‌ల్ బ్యాన‌ర్ పై నిర్మించారు. ఊహించ‌ని విదంగా ఈ మూవీ క‌మ‌ల్ కెరీర్ లోనే రికార్డు స్థాయి విజ‌యాన్ని సాధించ‌డ‌మే కాకుండా భారీ వ‌సూళ్ల‌ని రాబ‌ట్టింది.

ఇక ఇందులో క‌మ‌ల్ తో పాటు విజ‌య్ సేతుప‌తి, ఫహ‌ద్ ఫాజిల్‌ల తో పాటు హీరో సూర్య కీల‌క అతిథి పాత్ర‌లో రోలెక్స్ గా న‌టించిన సినిమాకు ప్ర‌ధాన హైలైట్ గా నిలిచిన విష‌యం తెలిసిందే. అంతే కాకుండా ఈ మూవీకి కార్తి న‌టించిన `ఖైదీ` మూవీకి లింక‌ప్ చేస్తూ రూపొందించ‌న స‌న్నివేశాలు కూడా ప్ర‌ధాన హైలైట్ గా నిలిచి ఈ మూవీ సీక్వెల్ పై మ‌రిన్ని అంచ‌నాల్ని రేకెత్తించాయి. ఇదిలా వుంటే ఈ మూవీకి ల‌భించిన అనూహ్య విజ‌యంతో మ‌ళ్లీ ట్రాక్ లోకి వ‌చ్చేసిన క‌మ‌ల్ హాస‌న్ రాజ్ క‌మ‌ల్ ఇంట‌ర్నేష‌న‌ల్ బ్యాన‌ర్ పై బ్యాక్ టు బ్యాక్ క్రేజీ కాంబోల‌తో సినిమాలు చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు.

ఇప్ప‌టికే `విక్ర‌మ్‌` మూవీని త‌మిళ నాడులో డిస్ట్రిబ్యూట్ చేసి క‌మ‌ల్ కు అండ‌గా నిలిచిన ఉద‌య‌నిధి స్టాలిన్ తో ఓ మూవీని నిర్మించ‌డానికి ప్లాన్ చేస్తున్న క‌మ‌ల్ హాస‌న్ త్వ‌ర‌లో కార్తి హీరోగా కూడా ఓ భారీ సినిమాకు శ్రీ‌కారం చుట్ట‌బోతున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. విశేషం ఏంటంటే ఈ మూవీని కూడా లోకేష్ క‌న‌గ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నాడ‌ట‌. ఇప్ప‌టికే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన చ‌ర్చ‌లు పూర్త‌య్యాని తెలుస్తోంది.

అంతే కాకుండా ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న త్వ‌ర‌లోనే రానుంద‌ని, వ‌చ్చే ఏడాది ఈ మూవీని సెట్స్ సైకి తీసుకెళ్ల‌నున్నార‌ని ఇన్ సైడ్ టాక్‌. ఇదిలా వుంటే త్వ‌ర‌లో లోకేష్ క‌న‌గ‌రాజ్ స్టార్ హీరో విజ‌య్ తో ఓ భారీ యాక్ష‌న్ డ్రామాని తెర‌పైకి తీసుకురాబోతున్నారు. ఆ త‌రువాత కార్తి న‌టించిన `ఖైదీ`కి సీక్వెల్ ని తెర‌పైకి తీసుకురానున్నాడు. ఈ రెండు సినిమాల త‌రువాతే కార్తితో క‌మ‌ల్ చేయ‌నున్న ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్క‌నుంద‌ట‌. కార్తి రీసెంట్ గా `స‌ర్దార్‌` మూవీతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన విష‌యం తెలిసిందే. స్పై థ్రిల్ల‌ర్ గా రూపొందిన ఈ మూవీ తెలుగు, త‌మిళ భాష‌ల్లో మంచి టాక్ ని సొతం చేసుకుని విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శింప‌బ‌డుతోంది.