Begin typing your search above and press return to search.
ఆకలిరాజ్యం కాదు 'చీకటిరాజ్యం'
By: Tupaki Desk | 24 May 2015 7:30 AM GMTకమల్‌హాసన్ కెరీర్ ఆరంభంలో ఆకలిరాజ్యం సినిమాలో నటించాడు. కె.బాలచందర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా ఓ సంచలనం. ఆ రోజుల్లో ఉపాధి లేక నిరుద్యోగులు పడే పాట్లు ఎలా ఉంటాయో కళ్లకు గట్టారు ఈ చిత్రంలో. అదో సంచలనం. ఇప్పటికీ ఆ సినిమా బుల్లితెరపై టీఆర్‌పీల్లో ట్రెండ్‌సెట్టర్. ఇప్పుడు కమల్‌హాసన్ మరో ప్రయోగాత్మక చిత్రంలో నటిస్తున్నాడు. దీనికి టైటిల్ 'చీకటి రాజ్యం'. ఈ టైటిల్ వినగానే వెంటనే ఆకలిరాజ్యం గుర్తొస్తుంది. తమిళ్‌లో దీనికి తూంగవనం అనే టైటిల్‌ని నిర్ణయించారు. ఇది తమిళనాట జరిగిన ఓ యథార్థ గాధ ఆధారంగా తెరకెక్కుతోంది.
అప్పట్లో కొందరు దళితుల్ని ఎన్‌కౌంటర్ చేసి చంపేసిన ఘటననే ఈ చిత్రంలో చూపిస్తున్నారని, పూర్తిగా వివాదాస్పద అంశమవుతుందని చెబుతున్నారు. కమల్ ఏదైనా స్క్రిప్టుని ఎంచుకున్నాడంటే అది కచ్ఛితంగా వివాదంతో ముడిపడినదే అవుతోంది. ఇదే చిత్రంలో కథానాయికగా త్రిషను ఎంచుకున్నారు. త్వరలోనే హైదరాబాద్‌లో షూటింగ్ మొదలు కానుంది. ఆకలిరాజ్యంలో శ్రీదేవి కథానాయిక, చీకటిరాజ్యంలో త్రిష కథనాయిక. సూపరు ఛాన్స్ కదూ? త్రిష కూడా శ్రీదేవి అంత పెర్ఫామ్ చేస్తుందంటారా?