Begin typing your search above and press return to search.

ట్రెండీ స్టోరి: ఎదురేలేని విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్

By:  Tupaki Desk   |   27 Jun 2023 1:30 AM IST
ట్రెండీ స్టోరి: ఎదురేలేని విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్
X
ఒకే ఒక్క పాన్ ఇండియా బ్లాక్ బ‌స్ట‌ర్ క‌మ‌ల్ హాస‌న్ ద‌శ దిశ తిప్పేసింది. అదే 'విక్ర‌మ్'. లోకేష్ క‌న‌గ‌రాజ్ తెర‌కెక్కించిన ఈ భారీ మ‌ల్టీస్టార‌ర్‌ సినిమాలో నిజానికి క‌మ‌ల్ త‌న న‌ట‌విశ్వ‌రూపాన్ని ప్ర‌ద‌ర్శించారు. అయితే విశ్వ‌న‌టుడిగా ఎదురేలేని వాడిగా పేరు తెచ్చుకున్న క‌మ‌ల్ హాస‌న్ కెరీర్ ఇటీవ‌లి కాలంలో ఊహించ‌ని విధంగా డౌన్ ఫాల్ అయింది. విశ్వ‌రూపం-విశ్వ‌రూపం 2 -ఉత్త‌మ విల‌న్ లాంటి భారీ చిత్రాలను స్వీయ‌ ద‌ర్శ‌క‌త్వంలో సొంత బ్యాన‌ర్ లో నిర్మించి ఆర్థికంగా బాగా దెబ్బ తిన్న క‌మ‌ల్ హాస‌న్ కొన్నేళ్లుగా పూర్తి క్రైసిస్ లో ఉన్న స‌మ‌యంలో విక్ర‌మ్ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ తో తిరిగి త‌న అప్పుల‌న్నిటినీ తీర్చ‌గ‌లిగాన‌ని బ‌హిరంగంగా వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే. ఇక ఆ త‌ర్వాత క‌మ‌ల్ హాస‌న్ తిరిగి పున‌రుజ్జీవం పొందారు. ఇప్పుడు ఎదురేలేని వాడిగా భార‌త‌దేశంలో అసాధార‌ణ క్రేజ్ ఉన్న చిత్రాల‌తో ఇత‌ర స‌మ‌కాలిక స్టార్ల‌కు ధీటుగా స‌త్తా చాటేందుకు దూసుకొస్తున్నాడు.

ఇప్ప‌టికిప్పుడు క‌మ‌ల్ హాస‌న్ సంత‌కాలు చేసిన సినిమాల జాబితాను ప‌రిశీలిస్తే ఉల‌గ‌నాయ‌గ‌న్ త‌న స్థాయికి త‌గ్గ చిత్రాల్లో న‌టిస్తున్నార‌ని అభిమానులు అంగీక‌రిస్తున్నారు. భార‌త‌దేశంలోనే అత్యంత విల‌క్ష‌ణ న‌టుడిగా వైవిధ్యం ఉన్న కంటెంట్ తో సినిమాల‌ను తీయ‌గ‌ల స‌త్తా ఉన్న ఆల్ రౌండ‌ర్ గా క‌మ‌ల్ హాస‌న్ కి గుర్తింపు ఉంది. న‌టుడిగా ద‌ర్శ‌కుడిగా ర‌చ‌యిత‌గా అత‌డు ఒక లెజెండ్‌. ఎదురే లేనివాడు. కానీ అత‌డికి స‌రైన సినిమా ప‌డ‌డంలోనే ఆల‌స్య‌మైంది. చాలాకాలానికి లోకేష్ క‌న‌గ‌రాజ్ రూపంలో విక్ర‌మ్ త‌న‌ను వ‌రించింది. ఆ ఒక్క సినిమా క‌మ‌ల్ ద‌శ దిశ మార్చేసింది.

ఇప్ప‌టికిప్పుడు క‌మ‌ల్ హాస‌న్ భార‌తీయుడు 2 లాంటి క్రేజీ సినిమాతో సంచ‌ల‌నాలు సృష్టించేందుకు సిద్ధ‌మ‌వుతున్నాడు. శంక‌ర్ లాంటి క్రేజీ డైరెక్ట‌ర్ ఈ భారీ పాన్ ఇండియా చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డం తో ఈ సినిమాపై బ‌జ్ నెల‌కొంది. మ‌రోవైపు ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా నాగ్ అశ్విన్ తెర‌కెక్కిస్తున్న భారీ పాన్ వ‌ర‌ల్డ్ సినిమా ప్రాజెక్ట్ కేలో క‌మ‌ల్ హాస‌న్ ఓ కీలక పాత్ర‌ను పోషిస్తుండ‌డం స‌ర్వ‌త్రా ఆస‌క్తిని క‌లిగిస్తోంది.

సైన్స్ ఫిక్ష‌న్ ఫాంట‌సీ -టైమ్ ట్రావెలింగ్ నేప‌థ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం కోసం సింగీతం స్క్రిప్టు సూప‌ర్ వైజ‌ర్ గా ప‌ని చేయ‌డం ఉత్కంఠ క‌లిగించే విష‌యం. లెజెండ్ సింగీతం శ్రీ‌నివాస‌రావు- ఉల‌గ‌నాయ‌గ‌న్ క‌మ‌ల్ హాస‌న్ వంటి దిగ్గ‌జాల క‌ల‌యిక సృజ‌నాత్మ‌క‌త ప‌రంగా మ‌రో స్థాయికి స‌హ‌క‌రిస్తుంద‌ని అభిమానులు అంచ‌నా వేస్తున్నారు. ప్రాజెక్ట్ కే భార‌తీయ సినీప‌రిశ్ర‌మ‌లో మ‌రో కొత్త మైలురాయిని సృష్టిస్తుంద‌ని అభిమానులు భావిస్తున్నారు.

ఇంత‌లోనే క‌మ‌ల్ హాస‌న్ మ‌రో భారీ చిత్రానికి సంత‌కం చేశార‌ని కోలీవుడ్ లో వార్త‌లు వినిపిస్తున్నాయి. పొన్నియ‌న్ సెల్వ‌న్- పొన్నియ‌న్ సెల్వ‌న్ 2 చిత్రాల‌తో భారీ హిట్లు అందుకున్న మ‌ణిర‌త్నం తెర‌కెక్కించే భారీ మ‌ల్టీస్టార‌ర్ చిత్రానికి క‌మ‌ల్ హాస‌న్ సంత‌కం చేసారు. 1987 విడుదలైన నాయకన్ తర్వాత కమల్ హాసన్-మణిరత్నం కలయిక ఆస‌క్తిగా మారింది. కమల్ హాసన్ -మణిరత్నంల కొత్త చిత్రంలో సిలంబరసన్ (శింబు) కూడా న‌టిస్తార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే హైప్ పతాక స్థాయిలో ఉన్న ఈ సినిమా కాస్టింగ్ టెక్నీషియ‌న్స్ ఎంపిక‌లు అంత‌కంత‌కు ఉత్కంఠ పెంచుతున్నాయి.

తాజా ప‌రిణామాలు ప‌రిశీలిస్తే... కమల్ హాసన్ కొత్త ఇన్నింగ్స్ అజేయంగా క‌నిపిస్తోంది. 80 లు 90లలో అత‌డు ఎంత పెద్ద స్టార్ గా ఏలాడో ఇప్పుడు అంత‌కుమించి అని నిరూపించేందుకు సిద్ధ‌మ‌వుతున్నాడ‌ని అర్థ‌మ‌వుతోంది. విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ నుంచి మునుముందు భారీ ప్రయోగాత్మ‌క చిత్రాల‌ను వీక్షించేందుకు ఆస్కారం ఉంది. అలాగే త‌న బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ విక్ర‌మ్ కి సీక్వెల్ రూపొందించేందుకు లోకేష్ క‌న‌గ‌రాజ్ ఇప్ప‌టికే స్క్రిప్టు పై ప‌ని చేస్తుండడంతో స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. ఆస్కార్ లు అందుకునేందుకు మ‌నం హాలీవుడ్ కి వెళ్ల‌కూడ‌దు. హాలీవుడ్ నుంచి వాళ్లే ఇండియాకి అవార్డులు అందుకునేందుకు దిగి వ‌చ్చేలా చేయాల‌ని ఆత్మ‌విశ్వాసంతో మాట్లాడ‌గ‌లిగిన ఏకైక హీరో క‌మ‌ల్ హాస‌న్. అత‌డి భ‌విష్య‌త్ సినీ ప్ర‌యాణం అంత‌కంత‌కు ఉత్కంఠ‌ను పెంచుతోంది.