Begin typing your search above and press return to search.
భారతీయుడికి ఆ ఒక్కటే అడ్డంకి
By: Tupaki Desk | 1 Jun 2022 3:27 AM GMTవిశ్వనటుడు కమల్ హాసన్ - శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన `భారతీయుడు`(1996) ఎంతటి సంచలనాలు సృష్టించిందో తెలిసిందే. దాదాపు రెండు దశాబ్ధాల అనంతరం ఈ సినిమాకి సీక్వెల్ ని తెరకెక్కిస్తున్నారు. కమల్ -శంకర్ బృందం లైకాతో కలిసి ఈ ప్రయత్నం ప్రారంభించింది. కొంత మేర షూటింగ్ అయ్యింది. కానీ ఇంతలోనే ఊహించని అవాంతరాలు దర్శకనిర్మాతల మధ్య గొడవలకు కారణమైంది. ఏది ఏమైనా భారతీయుడు 2 చిత్రీకరణ నిలిచిపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. ఈ ప్రతిష్ఠాత్మక సినిమా త్వరగా పూర్తయి రిలీజ్ కి రావాలని అటు తమిళ అభిమానులతో పాటు ఇటు తెలుగు అభిమానులు కోరుకుంటున్నారు. కానీ అది ఇప్పట్లో సాధ్యమయ్యేట్టు కనిపించడం లేదు.
కోర్టు గొడవలతో సినిమా చిత్రీకరణ డిలే అవుతోంది. ఇంతకుముందు దర్శకుడు శంకర్ కి అనుకూలంగా కోర్టు తీర్పు రావడంతో అతడు రామ్ చరణ్ తో ఆర్.సి 15 ని ప్రారంభించి శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేస్తున్నారు. అయితే ఇంతలోనే విశ్వనటుడు కమల్ హాసన్ స్వయంగా పూనుకుని శంకర్ కి లైకాకి మధ్య సయోధ్యను కుదిర్చే ప్రయత్నం చేసారు. ఇది కొంతమేర ఫలించింది. కానీ ఆర్.సి 15 పూర్తయితే కానీ శంకర్ భారతీయుడు 2 చేసేందుకు సుముఖంగా లేరు. ఆ మేరకు దిల్ రాజు తో కమిట్ మెంట్ ఉంది. ప్రస్తుతం ఆయన ఆర్.సి 15ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని చిత్రీకరణను పూర్తి చేస్తున్నారు.
ఇంతలోనే ఫిలింనగర్ గుసగుసల ప్రకారం.. భారతీయుడు 2 ఎప్పటి నుంచి సెట్స్ కెళుతుంది? అన్నదానికి కమల్ హాసన్ `విక్రమ్` రిలీజ్ ప్రమోషన్స్ లో జవాబిచ్చారని తెలిసింది. ప్రస్తుతం శంకర్ ఆర్.సి 15తో బిజీగా ఉన్నారు. ఇది పూర్తయ్యాక భారతీయుడు 2 సెట్స్ పైకి వెళుతుందని చెప్పారు. అలాగే తాను భారతీయుడు 2 కి దర్శకత్వం వహించబోనని ఏడాదికి రెండు మూడు సినిమాలతో నటుడిగా బిజీగా ఉంటానని ఆయన ధృవీకరించినట్టు కథనాలు వెలువడ్డాయి.
ఇన్ని అడ్డంకులు ఊహించనివి!
లైకా సంస్థతో దర్శకుడు శంకర్ కి తొలి నుంచి సింక్ కుదరకపోవడమే ఈ డిలేకి కారణం. ఇరువర్గాల నడుమా వరుస వివాదాన్ని పరిష్కరించేందుకు విశ్వనటుడు కమల్ హాసన్ తీవ్ర ప్రయత్నాలు ఫలించినా కానీ వెయిటింగ్ తప్పడం లేదు. మోస్ట్ అవైటెడ్ `ఇండియన్ 2` ప్రారంభమైనప్పటి నుండి అనేక అడ్డంకులను ఎదుర్కొంది. ఈ సినిమా ఆరంభం నుంచి రకరకాల కష్టాల్లో కూరుకుపోయింది.
మధ్యలో దర్శకనిర్మాతల మధ్య న్యాయ వివాదాల కారణంగా ఆగిపోయింది. సెట్లో క్రేన్ యాక్సిడెంట్ లో మరణాలు కల్లోలానికి కారణమయ్యాయి. ఆ తర్వాత కోర్టు గొడవలు తెలిసిందే. ఎట్టకేలకు తిరిగి వివాదాల్ని పరిష్కరించుకుని సెట్స్ కి వెళ్లే సమయం ఆసన్నమైందని 2021 డిసెంబర్ లో శంకర్ షూట్ ను తిరిగి ప్రారంభిస్తారని కూడా ప్రచారమైంది. కానీ అవేవీ నిజాలు కాలేదు.
ఈ ఆలస్యం కారణంగానే.. భారతీయుడు 2 నుంచి కథానాయిక కాజల్ తప్పుకుందని కథనాలొచ్చాయి. అయితే దీనిపై అధికారిక ధృవీకరణ లేదు. సిద్ధార్థ్- రకుల్ ప్రీత్ సింగ్.. ప్రియా భవానీ శంకర్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. భారతీయుడు 2 అదే పేరుతో 1996లో వచ్చిన చిత్రానికి సీక్వెల్. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ ఈ ప్రాజెక్టును అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్నారు.