Begin typing your search above and press return to search.
లైకాపై కమల్ అభిమానులు సీరియస్
By: Tupaki Desk | 27 Feb 2020 5:15 AM GMTభారతీయుడు 2 (ఇండియన్ -2) సెట్స్ లో ఘోర దుర్ఘటన పై విశ్వనటుడు కమల్ హాసన్ ఎంతగా కలత చెందారో తెలిసిందే. ట్విటర్ లో కమల్ భావోద్వేగపు పోస్ట్ హృదయాల్ని కదిలించింది. బాధిత కుటుంబాలకు కోటి ఆర్ధిక సహాయం చేయడం.. ఆ ఫ్యామిలీని ఉద్దేశించి కమల్ మాట్లాడిన తీరు తెలిసిందే. ఇక లైకాని ఉద్ధేశించి సినిమాకు పనిచేస్తున్న కార్మికులందరికి భీమా కల్పించాలని..అప్పటివరకూ షూటింగ్ కు హాజరు కానని ఖరాకండీగా చెప్పి రియల్ హీరో అనిపించారు. అలాగే తక్షణం ఆ కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత లైకా పై ఉందని కోరారు. ఇవన్నీ జరిగితేనే తాను షూటింగ్ కు వస్తానని లేదంటే ప‌్రాజెక్ట్ వదులుకుంటాను అన్న స్థాయిలో రియాక్ట్ అయ్యారు.
తాజాగా లైకా స్పందిస్తూ ఈ వ్యవహారంపై ఓ లేఖ రాసింది. మృతుల కుటుంబాలకు రెండు కోట్లు ఆర్ధిక సాయం చేసాం. గాయపడిని వారికి మెరుగైన చికిత్స చేయిస్తున్నాం. అందరికీ భీమా సదుపాయం చేసాం. ఫిబ్రవరి 22కి ముందే ఇవన్నీ చేసాం. ఇవి మీ దృష్టికి రాలేదేమో! అయినా ప్రమాద సమయంలో మీరు అక్కడే ఉన్నారుగా? ఆ విషయం మేము గుర్తు చేయాల్సిన అవసరం లేదు. మీరు అడిగినవన్నీ ముందే చేసేసాం. దయచేసి మీరు ఇక సెట్స్ కు వస్తే షూటింగ్ పునఃప్రారంభిద్దాం అని ఆ లేఖలో ఘాటుగానే ఉంది.
అయితే ఈ లేఖ కమల్ అభిమానులకు కాస్త కటువుగానే అనిపించింది. లేఖలో లైకా కమల్ ని హెచ్చరించినట్లు ఉందని అంటున్నారు. కమల్ కి లైకా రూల్స్ .. సాయం గురించి తెలియలేదు అనుకున్నప్పుడు నేరుగా అతన్ని కలిసి వివరాలు వెల్లడించాలి. ఆయన పెద్ద స్టార్.. నాయకుడు... రకరకాల పనుల్లో బీజీగా ఉంటారు. ఆరోజు కార్మికుల శ్రేయస్సు కోరి లైకా విషయం లో అలా స్పందించి ఉంటారు. అంత మాత్రానా? ఓ లేఖ రూపంలో కమల్ కి ఈ విషయాలు వెల్లడిస్తారా? ఆయన్ని షూటింగ్ కి రమ్మని బహిరంగంగా డిమాండ్ లేమిటి? అంటూ మండి పడుతున్నారు. నేరుగా లైకా కంపెనీ తాలుకా ప్రతినిధులు కమల్ ని సంప్రదిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు.