Begin typing your search above and press return to search.
కమల్ జోరుమీదున్నాడు!
By: Tupaki Desk | 11 Jun 2015 5:30 PM GMTచాలారోజుల తర్వాత కమల్‌హాసన్ నేరుగా తెలుగులో ఓ సినిమా చేస్తున్నాడు. అదే... 'చీకటిరాజ్యం'. ఇందులో త్రిష, మధుశాలిని కథానాయికలుగా నటిస్తున్నారు. కమల్ శిష్యుడు రాజేష్ ఎమ్.సెల్వ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా విషయంలో కమల్ పక్కా ప్లానింగ్‌తో అడుగేస్తున్నట్టు తెలుస్తోంది. ఈమధ్యే సినిమాని ప్రకటించాడు కమల్. తెలుగులో చీకటిరాజ్యంగా, తమిళంలో తూంగావనంగా రూపొందిస్తున్నానని చెప్పుకొచ్చాడు. అయితే ఇంతలోనే తెలుగు వర్షన్ 70శాతం పూర్తి చేశాడట. కమల్ జోరు గురించి తెలుసుకొని అంతా ఆశ్చర్యపోతున్నారు. ఆయన కుర్రాళ్లకంటే వేగంగా పనిచేస్తున్నాడని అర్థమవుతోంది. ఈ బైలింగ్వల్ సినిమాని కమల్ తన సొంత సంస్థ రాజ్‌కమల్ ఫిల్మ్స్‌లో నిర్మిస్తున్నాడు.
కమల్ ప్రతీసారి తాను తమిళంలో తీసిన సినిమాని తెలుగులో అనువాద రూపంలో విడుదల చేస్తున్నాడు. దీంతో భారీగా ట్యాక్స్ చెల్లించాల్సి వస్తోంది. ఆ ట్యాక్స్‌ని తప్పించుకొనేందుకే ఇప్పుడు కమల్ రెండు భాషల్లో నేరుగా సినిమాని తెరకెక్కిస్తున్నాడు. సెన్సార్ సమయంలో ఎలాంటి ఇబ్బందులు రాకూడదనీ, నేరుగా తాను తెలుగులోనే సినిమాని తీశానని రుజువు చేసేలా సింహభాగం సినిమాని హైదరాబాద్‌లోనే తెరకెక్కిస్తున్నారు. సినిమా పూర్తయ్యేవరకు ప్రెస్‌మీట్లు పెట్టడానికి ఇష్టపడని కమల్ ఇటీవల తన 'చీకటిరాజ్యం' గురించి దర్శకుడితో ప్రెస్‌మీట్ ఏర్పాటు చేయించాడు. సినిమా విశేషాల్ని ఆయనతో చెప్పించాడు. మొత్తంగా అటు నిర్మాతగా, ఇటు హీరోగా పక్కా ప్లానింగ్‌తోనే అడుగులేస్తున్నాడు కమల్‌హాసన్.