Begin typing your search above and press return to search.
విశ్వనటుడికి అస్వస్థత.. హుటాహుటిన ఆసుపత్రికి
By: Tupaki Desk | 24 Nov 2022 4:21 AM GMTకరోనా తర్వాత పరిస్థితులు మారిపోయాయి. గతంలో ఎవరికైనా అనారోగ్యం అంటే.. అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం ఉండేది కాదు.ఎంతో సీరియస్ అయితే తప్పించి.. వారి ఆరోగ్యం గురించి.. యోగక్షేమాల గురించి పెద్దగా టెన్షన్ ఉండేది కాదు. ఇప్పుడు అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయని చెప్పాలి. అనూహ్యంగా అనారోగ్యం బారిన పడేవారు కొందరైతే.. మరికొందరు అందుకు భిన్నమైన పరిస్థితుల్ని ఎదుర్కొంటున్న పరిస్థితి.
కరోనా తర్వాత సామాన్యులే కాదు ప్రముఖులు సైతం ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్న సందర్భాలెన్నో. దీనికి తోడు చాలా మంది ప్రముఖుల వయసులో పెద్దవారు కావటంతో.. ఎప్పుడేం వార్తను వినాల్సి వస్తుందోనని భయపడే పరిస్థితి. తాజాగా విశ్వనటుడు కమల్ హాసన్ అస్వస్థతకు గురయ్యారు. కొవిడ్ బారిన పడిన ఆయన.. తర్వాత కోలుకున్నప్పటికి కొంతకాలం పాటు ఆసుపత్రిలోనే ఉండాల్సి వచ్చింది. కరోనా తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆయన రికవరీ కాస్త ఆలస్యమైందని చెబుతారు.
తర్వాత ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన ఆయన.. యాక్టివ్ గా ఉన్నారు. ఈ మధ్యనే ఆయన నటించిన విక్రమ్ మూవీ అనూహ్య విజయాన్ని అందుకోవటమే కాదు..కమల్ సత్తా ఏమిటన్నది చాటి చెప్పింది. ప్రస్తుతం ఆయన శంకర్ దర్శకత్వంలో ఇండియన్ 2లో నటిస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా జ్వరంతో పాటు.. శ్వాస తీసుకోవటంలో ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నట్లుగా చెబుతున్నారు. దీంతో.. ఆయన్ను హుటాహుటిన చెన్నైలోని రామచంద్ర ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతంవైద్యులు ఆయనకు చికిత్స మొదలు పెట్టారు. ఆయన త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని అభిమానులు ఆశిస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.