Begin typing your search above and press return to search.

విక్రమ్ మ్యాజిక్.. కమల్ పవర్ఫుల్ కాన్ఫిడెన్స్

By:  Tupaki Desk   |   2 Jun 2022 4:11 AM GMT
విక్రమ్ మ్యాజిక్.. కమల్ పవర్ఫుల్ కాన్ఫిడెన్స్
X
విశ్వనటుడు కమల్ హాసన్ చాలాకాలంగా వరుస పరాజయాలతో సతమతమవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఒకప్పుడు ఆయన సినిమాలు తెలుగులో కూడా మంచి విజయాన్ని అందుకున్నాయి. కానీ గత పదేళ్ల కాలంలో మాత్రం తెలుగు ప్రేక్షకులు కమలహాసన్ సినిమాలపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. కానీ ఇప్పుడు మాత్రం ఆయన నటించిన విక్రమ్ ఓ మోస్తారుగా పాజిటివ్ వైబ్రేషన్స్ తో రిలీజవుతోంది. ప్రముఖ నటీనటులు అలాగే దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఈ సినిమాను తెరకెక్కించడం తో తెలుగులో ఈ సినిమాకు ఒక మంచి మార్కెట్ అయితే ఏర్పడింది.

విక్రమ్ సినిమాలో కమల్ హాసన్ తో పాటు టాలెంటెడ్ నటులు ఫహాద్ ఫాజిల్, విజయ్ సేతుపతి అలాగే సూర్య కొన్ని ముఖ్యమైన పాత్రలో కనిపిస్తుండడంతో అంచనాలు అయితే గట్టిగానే ఉన్నాయి.

ఇక ఈ సినిమాలో ఏ క్యారెక్టర్ కూడా అనవసరం గా ఉండదు అని కథకు చాలా అవసరం అయ్యే క్యారెక్టర్స్ ఉన్నాయని కమల్ హాసన్ తెలుగు ప్రమోషన్స్ లో చెబుతున్నారు.

విక్రమ్ ఒక డార్క్ మూవీ అంటూ ఒక అడవిలో జంతువుల వేట తరహాలోనే మనుషులు ఈ ప్రపంచంలో ఇతరులను ఎలా వేటాడుతారు అనే ఇతివృత్తంతో ఈ సినిమా కొనసాగుతుందని ప్రతి పాత్ర కూడా వాటికి సంబంధించిన రెండు రకాల షేడ్స్ ను కలిగి ఉంటాయి అన్నారు. ఇక దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఈ సినిమా స్టొరీ లైన్ ను అద్భుతంగా వెండితెరపై ప్రజెంట్ చేశాడు అని కమల్ హాసన్ ప్రశంసలు కురిపించారు.

అలాగే సినిమాలో ఒక ప్రత్యేకమైన మ్యాజిక్ ఉంది అంటూ అది వెండితెరపై చూస్తేనే చాలా అద్భుతంగా ఉంటుంది అని కూడా అన్నారు. ఈ సినిమాను తెలుగులో నితిన్ హోం ప్రొడక్షన్స్ శ్రేష్ట మూవీస్ పై దాదాపు 400 థియేటర్లలో విడుదల చేస్తున్నారు.

ఇక నిర్మాత సుధాకర్ రెడ్డి సినిమా పై చాలా మక్కువ ఉన్న వారు అంటూ ఇంతకుముందు వారు చేసిన సినిమాలు కూడా ఎంతగానో ఆకట్టుకున్నాయని ఇక్కడ విక్రమ్ సినిమా కూడా భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు అని అన్నారు. అందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు కూడా తెలుపుతున్నట్లు కమలాసన్ వివరణ ఇచ్చారు.